సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, అక్టోబర్ 2022, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 11

 శ్రీచక్రదేవతల గాయత్రీమంత్రములు

1.       గణపతి గాయత్రి – ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి| తన్నో దంతిః ప్రచోదయాత్||

14, అక్టోబర్ 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 39

 

ఆయతామ్నాయవివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే పార్వతి ఇప్పుడు ఆయతామ్నాయ దేవతా వర్ణన చేస్తాను. ఈ దేవతను పూజించిన మాత్రముననే సమస్త సిద్ధులూ కలుగుతాయి. పాంచరాత్రము మరియు వైష్ణవ ఆగమములలో ఈ విద్యా కథనము చెయ్యబడినది. హే దేవేశీ! ఈమెను ఆరాధించే ఈశ్వరుడు మూడులోకములనూ పాలించగలుగుతున్నాడు. ఈ విద్యలు మొత్తము తొమ్మిది. ఈ కారణంగా శివా శివమయి. సిద్ధిరత్న మహాతంత్రమునందు గణేశామ్నాయము తెలుపబడినది. ఈ గణేశామ్నాయము ఏడు కోట్ల మహాతంత్రముల నుండి అలంకరించబడినది. వామదేవ మహాతంత్రము నందు సూర్యసంబంధిత జ్ఞానము ప్రకాశితము. సౌర జ్ఞానమయీ దేవీ మనః జ్ఞానశక్తి. అందువలననే ఈ దేవి చతురామ్నాయముల ద్వారా సదా సేవించబడుచున్నది. సింహాసన ప్రసంగమున నాలుగు ఆమ్నాయ దేవతలను చెప్పబడి ఉన్నది. వీరిని స్మరించిన మాత్రముననే మహా ఆపత్తులు దూరంగా పోవును.  

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన ఆయతామ్నాయవివరణం అను ముఫైతొమ్మిదవ భాగము సమాప్తము.

28, సెప్టెంబర్ 2022, బుధవారం

శ్రీ విద్యార్ణవ తంత్రం - శ్రీభువనానంద నాథ

                     శ్రీవిద్యార్ణవ తంత్రం
             
                     
                                                  

శ్రీలలితామహాత్రిపురసుందరిని బ్రహ్మ మయముగా భావించి ఆ బ్రహ్మ రూపముగా రూపాంతరము చెందడానికి చేసే సాధనయే శ్రీవిద్య. ఇక్కడ విద్య అనగా మంత్రము అని అర్ధము. శ్రీ అనగా శ్రీలలితామహాత్రిపురసుందరి. అనగా ఆమెకు సంబంధించిన మంత్ర, యంత్ర మరియు తంత్రశాస్త్ర విజ్ఞానమునే శ్రీవిద్య అని అంటారు. అనంతాయై వేదాః అను వేదవాక్యమును అనుసరించి, వేదరూపమైన శ్రీవిద్యకూడా అనంతము. నాకు శ్రీవిద్య తెలుసు అని చెప్పుకొనేవారు ఎవరికీ ఈ విద్య పూర్తిగా తెలియదనే చెప్పవచ్చు. 

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 38

 

పంచమీశకటయంత్రోద్దారప్రయోగసాధనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

ఇప్పుడు తర్పణ విధిని తెలుపబడుచున్నది. తిలలు, మైరేయము (చెరకు రసం నుండి తీసిన కల్లు) మరియు బన్ధూక పుష్పములతో క్రమంగా తర్పణములు వదలాలి. ముఫైఏడవ భాగంలో చెప్పిన విధంగా పూజ చేసిన తర్వాత సువర్ణాది పాత్రల్లో తర్పణాలు వదలాలి. ఈ విధమైన సాధన వలన సాధకుడు తప్పకుండా దేవి కృపకు పాత్రుడవుతాడు.

17, సెప్టెంబర్ 2022, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 10


      కాళరాత్రి

అస్య శ్రీ కాళరాత్రి మంత్రస్య| భైరవ ఋషిః| అనుష్టుప్ ఛందః| శ్రీకాళరాత్రి దేవతా| హ్రీం బీజం| స్వాహా శక్తిః| హుం కీలకం| శ్రీవిద్యాంగత్వేన వినియోగః|

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 37

 

పంచమీక్రమార్చనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – పంచమీ దేవి రత్నేశ్వరీ వర్ణన ఇప్పుడు చెయ్యబడుచున్నది. ఈ దేవతా మంత్రస్వరూపం ఈ క్రింది విధంగా ఉండును.