సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నా ప్రచురణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా ప్రచురణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2026, గురువారం

శ్రీచక్రనిత్య పూజా విధి

 


శ్రీచక్రనిత్య పూజా విధి







ఈ పుస్తకము మోహన్ పబ్లికేషన్స్ వారి దగ్గర లభ్యమవుతుంది. లేదా devullu.com లో కూడా బుక్ చేసుకోవచ్చును........

30, ఆగస్టు 2023, బుధవారం

శ్రీదుర్గా అష్టాక్షరీ అవరణ పూజా కల్పం

 

శ్రీదుర్గా అష్టాక్షరీ అవరణ పూజా కల్పం



మహాప్రకృతి స్వరూపమైన శ్రీదుర్గా దేవి సమస్త దేవీ దేవతాశక్తులు, తేజస్సులను కలిగి ఉంటుంది. దుర్గాదేవి సిద్ది కొరకు ఆమె యొక్క అయిదు శక్తులను పూజించాలని చెప్పబడినది. దుర్గాయాః పరమం తత్త్వం పంచరత్నేశ్వరీ మయం అని నానుడి. ఒక మంచి రోజున దుర్గా పంచరత్నేశ్వరీలను జపించాలి. శ్రీదుర్గా, సరస్వతి, శారికా, మాతంగి మరియు బగళాముఖి వీరిని దుర్గా పంచరత్నేశ్వరులని అంటారు. వీరి సమగ్ర సాధన వలన పురశ్చరణ ఫలము లభిస్తుంది. దుర్గాదేవి మంత్రములు ఏకాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, జయదుర్గా, శూలినీ దుర్గా, వనదుర్గా ఇలా పలువిధములు. ఈమె ఆరాధన వలన శత్రుపీడ తొలిగి విజయం కలుగుతుంది. సకల గ్రహబాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన వలన అన్ని దుర్గతులూ నశిస్తాయి. ఈ పుస్తకములో శ్రీదుర్గాదేవి అష్టాక్షరీమంత్రానికి సంబంధించి సంపూర్ణ ఆవరణార్చన విస్తారంగా తెలుపబడినది. ఈ క్రమము శ్రీవిద్యా క్రమమునకు దగ్గరగా ఉంటుంది. పాతగ్రంథములను పరిశీలించి ఈ పుస్తకమును సంకలనం చేశాను. ఈ పూజా విధానములో కూడా పలు భేదములు కనబడుతున్నాయి. 


Get this book from visit this link devullu.com




5, జనవరి 2023, గురువారం

శ్రీవనదుర్గా పంచశతి

 

శ్రీవనదుర్గా పంచశతి అనుష్ఠాన క్రమం


గురువుగారి ఆశీస్సులు మరియు అనుమతితో శ్రీవనదుర్గా మహావిద్యను ముద్రిస్తున్నాను. ఇందులో రెండు ఖండములు కలవు. ఒకటి దిగ్బంధన ఖండము. రెండు పారాయణ ఖండము. మొదటి ఖండము లో 343 మంత్రములు, రెండవ ఖండము లో 157 మంత్రములు కలిపి మొత్తం 500 మంత్రములు. దిగ్బంధనముల ప్రయోజనము, నాకు లభ్యమైనంత వరకు తెలిసినంత వరకు చాలా మంత్రముల పేరు, వాటి ప్రయోజనం ఇవ్వడం జరిగింది. అంతే కాకుండ మూల మంత్రమునకు సంబంధించిన పూర్వాంగ, ఉత్తరాంగ మంత్రములు వాటి న్యాసములతో కూడా ఈ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. వనదుర్గా సాధకులకు ఈ గ్రంథం కచ్చితంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్ వారి ద్వారా ఈ క్రింది లింకు ద్వారా లభించును.


శ్రీవనదుర్గా పంచశతి 




28, సెప్టెంబర్ 2022, బుధవారం

శ్రీ విద్యార్ణవ తంత్రం - శ్రీభువనానంద నాథ

                     శ్రీవిద్యార్ణవ తంత్రం
             
                     
                                                  

శ్రీలలితామహాత్రిపురసుందరిని బ్రహ్మ మయముగా భావించి ఆ బ్రహ్మ రూపముగా రూపాంతరము చెందడానికి చేసే సాధనయే శ్రీవిద్య. ఇక్కడ విద్య అనగా మంత్రము అని అర్ధము. శ్రీ అనగా శ్రీలలితామహాత్రిపురసుందరి. అనగా ఆమెకు సంబంధించిన మంత్ర, యంత్ర మరియు తంత్రశాస్త్ర విజ్ఞానమునే శ్రీవిద్య అని అంటారు. అనంతాయై వేదాః అను వేదవాక్యమును అనుసరించి, వేదరూపమైన శ్రీవిద్యకూడా అనంతము. నాకు శ్రీవిద్య తెలుసు అని చెప్పుకొనేవారు ఎవరికీ ఈ విద్య పూర్తిగా తెలియదనే చెప్పవచ్చు. 

20, ఆగస్టు 2022, శనివారం

పరాషోడశీ శ్రీచక్ర పూజా విధి

 

పరాషోడశీ శ్రీచక్ర పూజా విధి





షోడశీ మంత్రములు ముఖ్యముగా అయిదు విధములు. అవి రమా షోడశీ, పరా షోడశీ, కామాది షోడశీ, వామాది షోడశీ, శక్త్యాది షోడశీ. ఈ షోడశీ మంత్రముల ఆవరణ దేవతలు వేరువేరుగా ఉంటారు. ఆయా దేవతల పూజ శ్రీచక్రము లోనే నవావరణ పూజగా చెయ్యాలని కులాగమములో చెప్పబడినది. ఈ రోజుల్లో శ్రీచక్ర పూజ అంటే ఖడ్గమాల స్తోత్రంలో స్తుతించబడిన దేవతల ఆరాధన గానే చాలా మందికి తెలుసు. కానీ అదే శ్రీచక్రం లో షోడశీ మంత్ర భేదమును బట్టి ఆవరణ దేవతలు మారుతారు. 

షోడశీ ఉపాసకులకు మరియు ఔత్సాహికులకు ఈ పూజా విధానము అందుబాటులోకి ఉండాలనే సంకల్పంతో ఈ పుస్తకంలో పరా షోడశీ నవావరణ పూజా విధానం ఇవ్వడం జరిగింది. ఈ పూజా విధానం సంప్రదాయ శ్రీచక్ర పూజా విధంగానే ఉంటుంది. ఉపాసకుల సౌకర్యార్థం మిగతా షోడశీ ఆవరణ దేవతల వివరాలు ఈ పుస్తకం చివర్లో ఇవ్వబడ్డాయి. ఆయా మంత్రాలతో పూజ చేసుకోదలచిన వారు ఆయా దేవతలను మార్చుకోవాలి.

ఈ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చెయండి devullu.com  

27, నవంబర్ 2021, శనివారం

త్రికాల ఋగ్వేద సంధ్యావందనం

 త్రికాల ఋగ్వేద సంధ్యావందనం





మంత్రాలలో గాయత్రిని మించిన మంత్రము దేవతల్లో తల్లిని మించిన దైవము లేదని నానుడి. గాయత్రీ మంత్రోపాసన సంధ్యావందనంలో భాగము. కానీ మారుతున్న జనుల మనోచిత్తముల కారణంగా (దీనికి కాలమార్పు అని చెబుతున్నారు) సంధ్యోపాసన బాగా తగ్గింది. బుద్ధి వికసనమే ఈ మంత్ర ముఖ్య ఫలితం. మానవుని బుద్ధి సరైన దారిలో ప్రసరిస్తే అన్ని చోట్లా శాంతి పరిఢవిల్లుతుంది. తప్పుదారి పట్టిన మానవ బుద్ధి ఎప్పటికీ వినాశకమే అని అందరికీ తెలుసు. ఈ మంత్రోపాసకులకు మానసిక శాంతి, ధీరత్వం, జ్ఞానం, సుబుద్ధి మొదలగునవి ఎందువల్ల కలుగుతాయో అనుబంధంలో వివరించడం జరిగింది. కొన్ని పాత గ్రంథాల ఆధారంగా ఇందులో విషయాలను నేను సంకలనం చెయ్యడం జరిగింది. సంధ్యావందనము అన్ని వేదశాఖలూ మరియు తైత్తిరీయ ఉపనిషద్ ప్రకారం ఉన్నాయి. అయితే ఈ పుస్తకంలో ఋగ్వేద సంధ్యావందనం ఇవ్వబడినది. ఈ మధ్య అక్కడక్కడ దొరుకుతున్న పుస్తకాలలో గాయత్రీ మంత్ర స్వరం అన్ని శాఖలకూ ఒకటిగానే ఇవ్వబడుచున్నది. నిజానికి ఋగ్వేద గాయత్రీ మంత్ర స్వరంలో కించిత్ భేదం ఉంటుంది. ఈ పుస్తకంలో గాయత్రీ మంత్రస్వరమును ఋగ్వేద ప్రకారంగా ఇవ్వబడినది.



శ్రీభువనేశ్వరీ ఆవరణార్చణా కల్పము

శ్రీభువనేశ్వరీ ఆవరణార్చణా కల్పము

          

భువనములకు అధిపతి భువనేశ్వరి హకారము, రేఫ, మాయ (ఈంకారము)లతో కూడి ఉన్నదే శక్తిప్రణవము అదే హ్రీంఇదియే భువనేశ్వరి సూక్ష్మ రూపము హ ఒక ధ్వని దీని నుండియే సమస్త జగత్తు ఉత్పన్నమవుతున్నది అందువలననే ఈమె భువనములకు అధిపతి అయినది ఈ తల్లి ఆరాధన వలన జ్ఞానము, మోక్షము కలుగుతాయి శ్రీవిద్యోపాసకులకు ఈమెను ఆరాధించడం ఎంతో ముఖ్యము ఇంతటి ఉత్కృష్టమైన ఈమె ఆరాధన అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి “శ్రీభువనేశ్వరీ ఆవరణార్చన కల్పము” అను ఈ పుస్తకమును నా శిష్యుడు భువనానందనాథుడు అయలసోమయాజుల ఉమామహేశ్వర రవి పూర్తిగా దక్షిణాచార సంప్రదాయంలో సంకలనం చేసి భక్తజనులకు, సాధకులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు అతని ఈ ప్రయత్నాన్ని మంత్రవేత్తలు, సాధకులు అభినందింతురుగాక 



 

 

28, అక్టోబర్ 2021, గురువారం

శ్రీ దక్షిణామూర్తి తంత్రం

 

శ్రీ దక్షిణామూర్తి తంత్రం











క్తిఉపాసనను తెలుపుటకు చాలా తంత్ర గ్రంథములు కలవు. వాటిలో శ్రీదక్షిణామూర్తి సంహిత ఒకటి. భగవంతుడు శివుని మరొక రూపమైన దక్షిణామూర్తి మరియు పార్వతి సంవాదములో ఈ తంత్రము సాగుతుంది. తాంత్రిక వాఙ్మయము అత్యంత విశాలము. దక్షిణామూర్తి సంహిత ఆ విశాల వాఙ్మయమునకు ఒక చిన్న కొమ్మ. అరవైఅయిదు భాగములున్న ఈ తంత్రమునందు  శివపార్వతులు, విభన్నమైన, నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తులను, వారి స్వరూపములను, వారి ఉపాసనా పద్ధతులను చర్చించారు. ఈ వాఙ్మయము తెలుగులో ....

25, ఆగస్టు 2021, బుధవారం

శ్రీబాలాత్రిపురసుందరి ఆవరణార్చన కల్పము

 శ్రీబాలాత్రిపురసుందరి ఆవరణార్చన కల్పము


త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి. ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.

21, ఆగస్టు 2021, శనివారం

శ్రీదక్షిణకాళీ ఆవరణార్చన కల్పము

 

శ్రీదక్షిణకాళీ ఆవరణార్చన కల్పము

జీవుడే కాలుడు. ఆ కాలుని శక్తే కాళి. దశమహావిద్యలలో మొదటి విద్య. కొందరు ఈమెను శ్యామా అని కూడా పిలుస్తారు. ఈమె కాలస్వరూపిణి. ఈమెను ఆరాధించడం వలన సాధకుడు తనను కాలునిగా తెలుసుకుంటాడు.

 




                          శ్లో||  జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ|

                                దుర్గాక్షమా శివధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే||


6, జులై 2021, మంగళవారం

శ్రీమహాగణపతి ఆవరణార్చన కల్పము


శ్రీమహాగణపతి ఆవరణార్చన కల్పము






కలౌ వినాయకో చండీ అని నానుడి. విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాధునికే నిర్వహిస్తారని సాధకులకు, భక్తులకు విదితమే. నేటి కాలంలో మహా గణపతి చతురావృత్త తర్పణాలు, హోమములు ఎంతో ప్రాచుర్యం పొందాయి. శ్రీచక్రమును ఆవరణదేవతా సహితంగా పూజించే పద్ధతి సాధకులకు విదితమే. ఆ విధంగానే మహా గణపతి ఆవరణ పూజా పద్ధతి కూడా ఉంది. కానీ ఈ మహా గణపతి ఆవరణ పూజా విధానము ఎందువలన మరుగున పడిపోయినదో తెలియదు. 

29, డిసెంబర్ 2020, మంగళవారం

ఆత్మయోగం - శ్రీవిద్యా సాధనాసారం పుస్తకం త్వరలో మోహన్ పబ్లికేషన్స్ ద్వారా విడుదల

 

ఆత్మయోగం

                                  శ్రీవిద్యా సాధనాసారం





చంచలమైన మనస్సు వానరం. గురువు అనుగ్రహం వల్ల గురికుదిరిన మనస్సు అద్వితీయమైన వానర వీరుడు హనుమత్ స్వరూపం. నేడు నిత్య జీవితంలో ఆధ్యాత్మికత గూర్చి ఆలోచించే సమయమే లేక అహరహరమూ ఉరుకులు, పరుగులతో గడుస్తున్న జీవితం చివరకు కదలలేక, కదలచేతకాక ఆసుపత్రి బంధ కంబంధాలలో ముగుస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ఎలా చిగురిస్తే, ఎలా వృద్ధిచెందిచుకోవాలో, జీవితాన్ని ఎలా ఆధ్యాత్మిక ప్రగతిలో పయనింపజేయాలో తేలియజేసేదే ఈ ఆధ్యాత్మిక కథ.

27, అక్టోబర్ 2020, మంగళవారం

 శ్రీచండీ ఆవరణ పూజ విధి

చండీ ఆవరణ పూజ విధి పాత్రా సాధన పూర్వకంగా విపులంగా వివరించబడిన గ్రంధం అస్మత్ శ్రీగురువుల అనుఙ్ఞతో సాధక లోకానికి అందించబడింది.








ప్రతులు

మోహన్ పబ్లికేషన్సు వారి దేవుళ్ళు.కామ్  లో లభించును



3, జూన్ 2018, ఆదివారం

ESOTERIC OF SRIVIDYA

ESOTERIC OF SRIVIDYA

Spiritual Journey of a Common Man








Description of "ESOTERIC OF SRIVIDYA"
This book is about spiritual sadhana. How a mantra is to be practiced, how to overcome the hurdles during spiritual journey, what is the importance of a right guru etc.
In this book, practices of Srividya sadhana is dealt in a lucid way as a common man's story. Srividya samaya secrets are also discussed. There is no doubt that this book will guide all who wants to develop spiritually.

To get this book


24, మే 2018, గురువారం

శ్రీవిద్యా ప్రకాశిక - శ్రీయాగ కర దీపిక


SriVidya Prakashika (Telugu Edition) 









A Detailed Description on SRIVIDYA MANTRA,YANTRA,TANTRA and SriYaga Procedure which deals the detailed Ritualistic procedure of SriChakra Navavarana. This book is composed based on Dakshinachara Sampradaya

Description of "SRIVIDYA PRAKASHIKA"
శ్రీవిద్య మంత్ర,యంత్ర,తంత్రములను గూర్చి శ్రీచక్ర నవావరణ పూజయైన శ్రీచక్రయాగమును గూర్చిసవివరముగా కూర్చబడిన గ్రంథం ఈ శ్రీవిద్యా ప్రకాశిక. దక్షణాచార సంప్రదాయంలో శ్రీయాగక్రమం, పాత్రాసాధన, ముద్రలు, హోమవిధానంతో పాటుగా విశ్లేషణాత్మకంగా వివరించడమైనది. దక్షణాచార సాధకులకు ఈ కల్పం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే సంకల్పంతో పుస్తకం ముద్రించబడుతుంది.


ఈ పుస్తకం కొరకు ఈ క్రింది వారిని సంప్రదించండి

devullu.com






6, మార్చి 2018, మంగళవారం

SRI CHAKRA YAGA ANTHARARTHAMU




శ్రీచక్రయాగ అంతరార్థము










Description of "శ్రీచక్రయాగ అంతరార్థము"

శ్రీచక్రపూజా విధానమును తెలుపు గ్రంథములు పెక్కు కలవు అయితే పూజా క్రియావిధానానికి సంబంధించి అర్థములు మాత్రము చాలా వరకు గ్రంధస్తం కాలేదు. శ్రీచక్రోపాసన రహస్యాలు అనంతాలు ఈ పుస్తకం శ్రీవిద్యలో అడుగిడు బాల్య శ్రీవిద్యోపాసకులకు చక్కని చేయూత, అంతే కాక కొంత మంది నిష్ణాతులకు కూడా తెలియని విషయములు,రహస్యములను ఇందు పొందు పరచబడినవి.