సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 12

 శ్రీచక్రన్యాస కవచం (సంహార న్యాసం)

పై విధంగా షోఢాన్యాసము చేసిన తర్వాత కామరతి న్యాసము చెయ్యాలి. శివతా ప్రాప్తి గురించి శ్రీచక్ర న్యాసము చెయ్యాలి. ఈ న్యాసము శరీర శుద్ధి కారకము అవుతుంది.

26, జులై 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 12

 పన్నెండవ భాగము

కామేశ్వరీపూజా విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు -

కేవలము కామబీజము "క" కామేశ్వరీ మంత్రము. ఈ మంత్ర దేవత - కామేశ్వరి| కం - బీజం| కం - శక్తిః| లం - కీలకం| ఈ విద్య పరమ వశీకారిణి.

23, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 11

కాకినీ న్యాసము

స్వాధిష్టాన స్థిత షడ్దళ కమలమునందు మేద ధాతురూపంగా కాకినీ దేవతను దళకర్ణికయందు ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

19, జులై 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 11

 

పదకొండవ భాగము

లలితార్చన విధివివరణం

శివుడు చెప్పుచున్నాడు - హే దేవేశీ! నేను నా దక్షిణ ముఖము నుండి ఇప్పటికీ లలితా పరా రక్త నేత్రా త్రిపురా కామేశ్వరీ జపమును చేస్తున్నాను. శక్తిబీజము, వాగ్భవబీజము, కామబీజములను ఇంతకు ముందు చెప్పిన విధంగా లిఖించవలెను. చివర శివ బీజమును జోడించాలి. అది త్రిపురేశీ మంత్రము అవుతుంది. మంత్ర స్వరూపము ఈ విధంగా ఉండును

16, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 10

న్యాసక్రమము

వైశంపాయన సంహితయందు ఈ విధంగా చెప్పబడినది - ఉపాస్య మంత్ర న్యాసములో ఋష్యాది న్యాసములు చెయ్యాలి. సిద్ధిపొందగోరువారు ఏ మంత్రమును ఉపాసిస్తారో ఆ మంత్ర న్యాసము చెయ్యాలి. జపము, తర్పణము, హోమము, అర్చనల వలన సిద్ధి కలిగినా సరే అంగన్యాస కరన్యాసములతో చెయ్యని మంత్ర జపము ఫలమునివ్వదు. అన్ని న్యాసములను సాధకుడు తన దేహమునందు చేసినచో అతడు మూడులోకములను వశపరచుకోగలడు. అతడి అన్ని పాపములూ వెంటనే పోవును. అన్ని రాక్షస, సర్పాదులు అతడికి దూరంగా ఉండును. ముందు ఋష్యాది న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత వరుసగా కరన్యాస, అంగన్యాసములు, మంత్రవర్ణన్యాసము, మంత్రపద న్యాసము, విశేషమైన మంత్ర కల్పోక్త న్యాసము, మంత్ర పుటితవర్ణములతో సానుస్వార మాతృకా న్యాసములు చెయ్యాలి. మంత్రవిదుడు యుక్తముగా శాస్త్ర నిర్ధిష్ట మార్గములో న్యాసము చేసి, అంగన్యాస, కరన్యాసములు చేసి, ముద్రలను ప్రదర్శించాలి.

9, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 9

యోగాభ్యాస క్రమము

పద్మాసనము మీద కూర్చోని రెండు కళ్ళూ మూసుకోవాలి. చిత్తవృత్తిని మూలాధారమునందు లగ్నము చెయ్యాలి. మూలమంత్రమును ఉచ్చరిస్తూ ఇడా నాడీ నుండి పదహారు మాత్రలలో వాయువును పూరించాలి. ఆ వాయువును మూలాధారమునకు తీసుకురావాలి. అంగుష్ఠ - కనిష్ఠిక - అనామికలను కలిపి నాసాపుటమును బంధించాలి. 64 మాత్రల కాలము బాటు ఆ వాయువును లోపల కుంభించాలి. 32 మాత్రల కాలంలో ఆ వాయువును పింగళ నాడి ద్వారా నెమ్మ నెమ్మదిగా రేచకము చెయ్యాలి. ఈ విధంగా ఇది ఒక ప్రాణాయామము అవుతుంది. ఆ తర్వాత పింగళ ద్వారా వాయువును పూరించి (పైన చెప్పిన విధంగా) కుంభకము, రేచకము చెయ్యాలి. ఈ విధంగా వ్యతిరేక క్రమంలో 16/12/6/3/2 సార్లు యథాశక్తి చెయ్యాలి. అప్పుడు సిద్ధి ప్రాప్తిస్తుంది. శారదాతిలక తంత్రము ప్రకారము మాత్రావృద్ధి క్రమంగా ప్రాణాయమము చెయ్యాలి. ఈ ప్రాణాయామమునందు ఎల్లప్పుడూ అందరికీ అధికారము కలదు. ప్రాణాయమము చేయకపోతే నింద కలుగుతుంది. పూజాకాలంలో భూతశుద్ధి కొరకు ఇది అవశ్యకమని అగస్త్య సంహిత యందు చెప్పబడినది. ఇది సాధారణ ప్రాణాయామ పద్ధతి.

6, జులై 2021, మంగళవారం

శ్రీమహాగణపతి ఆవరణార్చన కల్పము


శ్రీమహాగణపతి ఆవరణార్చన కల్పము






కలౌ వినాయకో చండీ అని నానుడి. విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాధునికే నిర్వహిస్తారని సాధకులకు, భక్తులకు విదితమే. నేటి కాలంలో మహా గణపతి చతురావృత్త తర్పణాలు, హోమములు ఎంతో ప్రాచుర్యం పొందాయి. శ్రీచక్రమును ఆవరణదేవతా సహితంగా పూజించే పద్ధతి సాధకులకు విదితమే. ఆ విధంగానే మహా గణపతి ఆవరణ పూజా పద్ధతి కూడా ఉంది. కానీ ఈ మహా గణపతి ఆవరణ పూజా విధానము ఎందువలన మరుగున పడిపోయినదో తెలియదు. 

2, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 8

ప్రాణాయామ మాత్రా లక్షణం

నారదుని ప్రకారము, శ్వాస యొక్క మాత్ర ఈ ప్రకారము ఉంటుంది - ఎంత సమయంలో చెయ్యి జానుమండలమును స్పర్శిస్తుందో అంత సమయమును ఏక మాత్ర అంటారు. ఆ మాత్రాకాలంలో శ్వాసను లోపలికి తీసుకోవాలి.