సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, జూన్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 8



నారాయణీయ మంత్ర ప్రబోధకాలము
తారాంత మరియు విసర్గాంత మంత్రములు ఆగ్నేయములు. మిగిలినవి సౌమ్యములు. ఇవి అన్నీ క్రూర మరియు సౌమ్య కర్మములందు ప్రయుక్తములవుతాయి. ఆగ్నేయమంత్రములు నమోన్విత ప్రశస్తములు. ఫట్కారా మంత్రములు సౌమ్యములు. పింగళా నాడి నుండి శ్వాస జరిగే సమయ్మున మంత్రము ఆగ్నేయము అవుతుంది. ఇడా నాడి నుండి శ్వాస జరిగే సమయమున మంత్రము సౌమ్యము అవుతుంది. పింగళా-ఇడా నాడుల రెండింటి నుండి శ్వాస జరిగే సమయమున మంత్రము ప్రబుద్ధమవుతుంది. అన్ని ప్రబుద్ధ మంత్రములు సాధకులకు ఫలప్రదాయకములు.

వృహన్నారాయణీయము
ఇందు ఈ విధంగా చెప్పబడినది - సుప్త మరియు ప్రబుద్ధ మంత్రములు సిద్ధిప్రదాయకములు కావు. ఇడా శ్వాస నుండి మంత్రము సుప్తమవుతుంది. పింగళా శ్వాస సమయమున మంత్రము జాగృతమవుతుంది. ఆగ్నేయ మంత్రము మంత్రము సౌమ్య మంత్రమునాకు విపరీతమవుతుంది. ప్రబోధకాలమునందు రెండు మంత్రములూ జాగృతమవుతాయి. మంత్రము సుప్తమయితే అది అది అనర్ధదాయకమవుతుంది.

శివ యామళే
మంత్రముతో బిందు సహితముగా "న" నుండి "ల" వరకు మరియు సవిసర్గ స్థానమునందు క్షకారం సంపుటీకరణ చేస్తే ఆ మంత్రము ప్రబుద్ధిదాయకమయ్యి శీఘ్రముగా సిద్ధిని ప్రసాదిస్తుంది.

కాళీమతము, శారదాయామలమునందు మంత్రదోషములు

మంత్రదోషము మరియు బాహ్యాంతర భేదము, దోషములు ఏ మంత్రము ద్వారా పరిహారమవుతాయో సాధకుల హితముకొరకై ఇక్కడ చెప్పబడుచున్నది.
ఛిన్నాది దోషములుగల మంత్రములు సాధకులకు ఉపయుక్తము కావు. మంత్ర దోషములు ఈ క్రింది ప్రకారము ఉంటాయి.
ఛిన్న(=ఛేదింపఁబడినది): ఏ మంత్రమునకు ఆది, మధ్యమ మరియు అంతమునందు వాయు బీజమైన యం ఉంటుందో మరియు ఆ బీజము సంయుక్త లేక వియుక్త లేక మూడు, నాలుగు లేక అయిదుసార్లు స్వరాక్రాంతమయితే ఆ మంత్రము ఛిన్నమవుతుంది.

రుద్ధ్వ: ఏ మంత్రమునకు ఆది, మధ్య మరియు అంతమునందు భూ బీజమైన లం రెండుసార్లు వుంటుందో ఆ మంత్రము రుద్ధమవుతుంది. అది ముక్తి వివర్జితమవుతుంది.

శక్తిహీన: ఏ మంత్రము మధ్యన హ్రీం, త్రితత్త్వ ఫ్రేం, హూం, ఓం, శ్రీం, ఫం ఉండవో ఆ మంత్రము శక్తిహీనమవుతుంది.

పరాఙ్ముఖ (=పెడమొగము): ఏ మంత్రమునకు ముందర క్లీం, నమః, స్వాహా, క్రోం ఉండవో ఆ మంత్రమును పరాఙ్ముఖ అంటారు.    

వధిర: ఏ మంత్రమునకు ఆది, మధ్యమ మరియు చివర హం, ఐం, ద్రాం ఉంటాయో ఆ మంత్రము వధిర అవుతుంది.

నేత్రహీన: పంచాశ్వర మంత్రములందు రేఫ, లుం,O, హం, ఐం ఉండవో అవి నేత్రహీనమంత్రములు. అవి దుఃఖ,శోక మరియు భయప్రదములవుతాయి.

కీలిత: ఏ మంత్రమునకు ఆది, మధ్యమ, చివరన మ,,,,,హౌం,ఐం,హం,,,,ఫ్రేం,హ్రీం,హూం,నమామి ఉండవో ఆ మంత్రమును కీలిత మంత్రము అంటారు.
స్తంభిత: ఏ మంత్రమునకు మధ్యన ఒక ఫట్, చివరన రెండు ఫట్లు,,,ల ఉండవో ఆ మంత్రములు స్తంభితములయి సిద్ధిరోదకములవుతాయి.

దగ్ధ: ఏ మంత్రము మూర్ధయందు యం,రం ఏడుసార్లు ఉంటాయో ఆ మంత్రమును దగ్ధ అంటారు.

త్రస్త: ఏ మంత్రాక్షరములందు రెండు, మూడు, ఆరు, ఎనిమిది ఫట్ లు ఉంటాయో ఆ మంత్రములను త్రస్తములంటారు.

భీత: ఏ మంత్రమునకు ముందు "ఓం" ఉండదో ఆ శివ లేదా శక్తి మంత్రమును భీతి అంటారు.

మలిన: ఏ మంత్రమునకు ఆది-మధ్యమ-అంతమున మణిచతుష్టయము ఉండునో, మంత్రజ్ఞులద్వారా అవి వివర్జితములు.

నిరస్కృత: ఏ మంత్రమునకు మధ్యన డకారము, హుంకారము చివర రెండు ఫట్ లు ఉంటాయో ఆమంత్రము నిరస్కృత అవుతుంది.

భేధిత: ఏ మంత్రమునకు ప్రారంభమున రెండు ఓంకారములు, మధ్యన వషట్, ఫట్ ఉంటాయో ఆ మంత్రము భేధిత అవుతుంది.

సుషుప్త: ఏ మంత్రమునందు మూడు అక్షరములుండి మధ్యన "హంస" ఉండదో ఆ మంత్రము సుషుప్త అవుతుంది.

మదోన్మత్త: ఏ మంత్రమునందు పదిహేడు కన్నా ఎక్కువ అక్షరములుండి, అయిదు ఫట్లు ఉంటే ఆ మంత్రము మదోన్మత్త అవుతుంది.

మూర్ఛిత: ఏ మంత్రమునకు మధ్యన ఫట్ ఉంటుందో అది మూర్చిత మంత్రము.

హ్యతవీర్య: ఏ మంత్రమునకు అంతమున గం ఉంటుందో అధి హ్యతవీర్య అవుతుంది.

హీన: పద్దెనిమిది అక్షరముల మంత్రమునకు ఆది-మధ్యమున-అంతమున నాలుగు ఫట్ లుంటాయో ఆ మంత్రము హీన మంత్రము.

ప్రధ్వస్త: పంతొమ్మిది అక్షరముల మంత్రమునందు ఓం,హ్రీం,క్రోం ఉంటే ఆ మంత్రమును ప్రధ్వస్త అంటారు.

బాలక: సప్తాక్షర మంత్రమును బాలక మంత్రమంటారు

కుమార: అష్టాక్షర మంత్రమును కుమార మంత్రమంటారు

యువ: షోడశాక్షర మంత్రమును యువ మంత్రమంటారు

ప్రౌఢ: నలభై అక్షరముల మంత్రమును ప్రౌఢ మంత్రమంటారు

వృద్ధ: ముఫై, అరవైనాలుగు, వంద, నాలుగువందల అక్షరముల మంత్రములను వృద్ధమంత్రములంటారు.

నిస్త్రింశక: ఓంకార సహితా నవాక్షారమంత్రమును నిస్త్రింశక మంత్రమంటారు.

నిర్బీజ: ఏ మంత్రమునకు చివర నమః, మధ్యన శిరోమంత్రక స్వాహా, వషట్, హూంఫట్, ఫట్ ఉండునో, హం మరియు క్లీమ్ ఉండవో ఆ మంత్రము నిర్బీజ మంత్రము.

సిద్ధిహీన: ఏ స్థానమునైనా ఆరుఫట్కారములుంటే ఆ మంత్రము సిద్ధిహీనమవుతుంది.

మంద: ఏ మంత్రమందు యం ఉంటుందో అది మంద మంత్రము.

నిరంశక: కూట ఏకాక్షర మంత్రమును నిరంశక అంటారు.

సత్త్వహీన: రెండు వర్ణముల మంత్రము సత్త్వహీనమవుతుంది.

కేకర: నాలుగు వర్ణముల మంత్రము కేకరవుతుంది.

బీజహీన: ఆరు అక్షరముల మంత్రము బీజహీనమవుతుంది.

ధూమిత: ఏడున్నర, ఆరున్నర వర్ణముల మంత్రమును ధూమిత లేదా నిందిత అంటారు.

ఆలింగిత: మూడున్నర, ఇరవైఒక్కటి,ఇరవై, ముఫై అక్షరముల మంత్రము ఆలింగిత.
మోహిత: ఇరవై రెండు వర్ణముల మంత్రము మోహిత.

క్షుధార్త: ఇరవైనాలుగు, ఇరవైఏడు వర్ణముల మంత్రము క్షుధార్త.

దృప్త: ఇరవైనాలుగు, పదకొండు, ఇరవైఐదు, ఇరవైమూడు వర్ణముల మంత్రము దృప్త అవుతుంది.

అంగహీన: ఇరవైయారు, ముఫైయారు, ఇరవైతొమ్మిదివర్ణముల మంత్రము అంగహీన.

అతికృద్ధ: ఇరవైఎనిమిది, ముఫైఒక్కటి అక్షరముల మంత్రము అతికృద్ధ. ఇది అన్ని కర్మములందూ నిందితము.

అతిక్రూర: ముఫై, ముఫైమూడు వర్ణముల మంత్రము అతిక్రూర. ఇది అన్ని కర్మములందు నిందితము.

సవ్రీడ: నలభై నుండి అరవీమూడు వర్ణముల వరకు గల మంత్రము సవ్రీడ.

శాంతమానస: అరవైఐదు అక్షరముల మంత్రము శాంతమానస.

స్థానభ్రష్ట: అరవైఅయిదు నుండి తొంభైతొమ్మిది అక్షరముల మంత్రము స్థానభ్రష్ట.

వికల: పదమూడు మరియు పదిహేను అక్షరముల మంత్రము వికల.

అతివృద్ధ: నాలుగువందల నుండి వెయ్యి అక్షరముల వరకు ఉన్న మంత్రములు అతివృద్ధ.

నిఃస్నేహ: నూరు, నూటయాభై, రెండువందలతొంభై, మూడువందలు అక్షరములు కల మంత్రమును నిఃస్నేహ అంటారు.

పీడిత: వెయ్యికన్నా ఎక్కువ అక్షరములున్న మంత్రము.
                                                                            ఇంకాఉంది...

12, జూన్ 2020, శుక్రవారం

వారాహీ నవరాత్రులు



వారాహీ నవరాత్రులు


శ్రీవిద్యోపాసనలో శ్రీవారాహీ ఉపాసన చాలా ముఖ్యము. ఈమె శ్రీ లలితాపరమేశ్వరి సేనాపతి. అందుకే ఈమెను దండనాయకి అని అంటారు. ఈమె శ్రీచక్రరాజమునకు ఎడమవైపున కిరిచక్రమును అధిరోహించి ఉండును. ఈమె జ్ఞానప్రదాత. ఈమె మంత్రములోని బీజాక్షరములు జ్ఞానమునకు మరియు అజ్ఞానమును తొలగించి పరబ్రహ్మ అయిన శ్రీలలితాపరమేశ్వరిని చేరుటకు సూచనలు.
దండనాధయను వారాహీ మంత్రోపాసన వలన "విశుక్రుడు" అను అహంకారస్వరూపుడు, సంసారలంపటుడు నశించును. అనగా ఆయాభావనలు నశించును. ఆ భావనల నాశనమే జ్ఞానము. అందుకే ఈమె జ్ఞానప్రదాత. సంసారకూపమనే జలములో మునిగిపోయిన తన సాధకుడిని జ్ఞానమనే తన దంష్ట్రములతో రక్షించేదే శ్రీవారాహీ.
శ్రీచక్రములోని వసుకోణమే (ఏడవ ఆవరణ - సర్వరోగహరచక్రం) కిరిచక్రము. ఇది ఒక రహస్యము.

ఆషాఢశుక్ల ప్రతిపత్ నుండి నవమి వరకు శ్రీ వారాహీ నవరాత్రులు. 
(ఈ సంవత్సరము తే22.06.2020ది నుండి శ్రీవారాహీ నవరాత్రులు.)

ఈరోజుల్లో మరొక ముఖ్యమైన ఉత్సవము పూరీలోని శ్రీ జగన్నాథస్వామి
వారి రథోత్సవము. శరీరమనే రథమును నడిపించే జీవుడే జగన్నాథుడు.
ఈ అద్భుతమైన రోజుల్లో సాధకులు అమ్మవారిని, స్వామివారిని విశేషంగా పూజించి తరింతురుగాక.

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 7


మంత్రములందు బ్రహ్మ క్షత్రాది భేదములు

మంత్రములు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర మరియు సంకర జాతులవుతాయి. వర్ణానుసారము అనులోమక్రమములో మంత్రములను ఇవ్వవలెను. కొన్ని మతముల ప్రకారము ప్రతిలోమ క్రమమునందు మంత్రములను ఇవ్వవలెను.
వామకేశ్వరము నందు కూడా ఈవిధముగానే చెప్పబడెను.

సౌత్రామణితంత్రము ప్రకారము

సౌత్రామణి తంత్రమునందు ఈ విధముగా చెప్పబడినది. మాయా బీజము "హ్రీం" బ్రహ్మజాతి. శ్రీ బీజము "శ్రీం" క్షత్రియ జాతి. కామదేవ మంత్రము "క్లీం" వైశ్య జాతి. వాగ్భవ బీజము "ఐం" శూద్ర జాతి. ఏ మంత్రమునందు ఈ నాలుగు బీజములుండునో ఆ మంత్రమును పౌరస్త్య (=మొదటిది) మంత్రము అని అంటారు. బ్రాహ్మణులకు నాలుగు బీజములును, క్షత్రియులకు మూడు బీజములును, వైశ్యులకు రెండు బీజములను మరియు శూద్రులకు ఒక బీజమును ఇవ్వవలెను.

కులమూలావతార ప్రకారము

కులమూలావతారమునందు ఈ విధంగా చెప్పబడినది - శ్రీదేవి శంకరునితో చెప్పినది - హే శంకరా! శాక్త, శైవ, సౌర, గాణపత్య మరియు వైష్ణవ మంత్రములందు బ్రాహ్మణ, క్షత్రియాది వర్ణులకు విశేషంగా సంకరులకు, ప్రవృత్తి సాధకుల హితము కొరకై వినడానికి ఇచ్ఛ ఉంటుంది. వారికి ఏఏ మంత్రములు హితమో తమరు చెప్పాలి.

ఈశ్వర ఉవాచ:

ఉమాదేవీ-

ఉమా, మహేశ్వర, దక్షిణామూర్తి, అఘోర, హయగ్రీవ మరియు అష్టాక్షర వారాహీ మంత్రములు శ్రేష్ఠములు.
ప్రణవాద్య వాసుదేవ, లక్ష్మీ నారాయణ మంత్రములను మూడు వర్ణముల వారికి ఇవ్వవచ్చు. శూద్రులకు ఈ మంత్రములను ఇవ్వరాదు.
పాశుపత, నారసింహ మరియు సుదర్శన మంత్రములు రెండు వర్ణములకు మాత్రమే ఇవ్వవలెను. వేరొకరికి ఈ మంత్రములు ఇవ్వరాదు.
అగ్నిమంత్రము, కుచ్ఛసూర్యమంత్రము, ప్రణవసహిత ఘృణిమంత్రము మూడు వర్ణముల వారికీ ఇవ్వవచ్చు.
అనుష్టుభ శక్తి మంత్రము, వింధ్యవాసినీ, నీలాసరస్వతీ మంత్రములు కూడా మూడు వర్ణముల వారికి ఇవ్వవచ్చును. మాతంగీ, ఉగ్రతార, శ్యామ, ఛిన్నమస్త మరియు బాలా మంత్రములను అన్ని వర్ణముల వారికీ ఇవ్వవచ్చు.
తారా, గణేశ, హరిద్ర గణేశ మంత్రములు మూడు వర్ణముల వారికీ ఇవ్వవచ్చు. ఈ మంత్రములు సర్వాసిద్ధి ప్రదాయకములు.
త్రిపుర, వటుకాది మంత్రములు అన్ని వర్ణముల వారికి ఇవ్వవచ్చు మరియు విశేషంగా స్త్రీలకు ఇవ్వవచ్చు.
హ్రీం, శ్రీం, ఓం, ఐం మరియు అన్యబీజ సంయుక్త మంత్రములను బ్రాహ్మణులకు, హ్రీం, శ్రీం, ఓం, ఐం సంయుక్త మంత్రములను క్షత్రియులకు, శ్రీం, ఐం బీజమంత్రములను వైశ్యులకు, ఐం మరియు అన్యబీజములను శూద్రులకు ఇవ్వవచ్చును. హృదాది 'హృం', ఫట్కారాది మంత్రములు సంకరులకు ప్రశస్త్యములు.



కులప్రకాశతంత్రము ప్రకారము మంత్రముల లింగ నిర్ణయము

యాభై వర్ణముల భేదము చేత అన్ని మంత్రములూ ఉత్మన్నమయ్యాయి. మంత్రవిద్యా విభాగము నుండి అన్ని మంత్రములూ రెండు రకములుగా ఉంటాయి. స్వాహాంత మన్త్రములు స్త్రీ మంత్రములుగాను, నమోన్త మంత్రములు నపుంసక మంత్రములుగాను చెప్పబడును. మిగిలిన మంత్రములు పురుష మంత్రములు. స్త్రీ మంత్రములు శాంతికర్మములందు, నపుంసకమంత్రములు ప్రయోగవిద్వేషణ మరియు అభిచారవిధులయందు ప్రయోగయుక్తములు. పురుష మంత్రములు సర్వావశీకరణ మరియు ఉచ్చాటన కర్మలందు ప్రయుక్తములు. అన్ని మంత్రములూ అగ్నిషోమాత్మకములు. రేఫ, ఓంకార, వియతయుక్త మంత్రములు ఆగ్నేయ, క్రూరకర్మ, మారణాది కర్మలందు ప్రయుక్తములు. సౌమ్యమంత్రములు సుధాత్మకములు మరియు సౌమ్య కర్మలందు ప్రయుక్తములు.
                                                                              ఇంకాఉంది...
                                                                                                                                 

5, జూన్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 6


వర్ణ విభాగమునుండి యోగ్యతా కాల విశేషము

శారదా తిలకము ప్రకారము, బ్రాహ్మణుడు ఒక సంవత్సరము, క్షత్రియుడు రెండు సంవత్సరములు, వైశ్యుడు మూడు సంవత్సరములు మరియు శూద్రుడు నాలుగు సంవత్సరములు గురు సేవ చేయగా యోగ్యత కలుగుతుంది. ఆ తర్వాత తర్వాత నుండి దీక్ష, యాగ, వ్రతాదులు గ్రహింపవచ్చును.

మంత్రమునందు శూద్రులకు అధికార విహీనత

మహాకపిల పంచరాత్రము ప్రకారము, శూద్రులకు మంత్రమునందు అధికారము లేదు. ప్రణవం లేకుండా వేదము లేదు. మంత్రము వేద సముద్భూతము. ఈ ప్రకారము వేదము పరమంత్రము. ఆగమములు వేదాంగములు. వశ్య-ఆకర్షణాదులు కర్మదృష్టా ఫలప్రదాయకములు. కలియుగమునందు వేదము చేత అన్ని గ్రహయజ్ఞాదులు సాధ్యము. వేదము లేకుండా యజ్ఞము లేదు. యజ్ఞము లేకుండా వేదము లేదు. ఇందువలననే వేదము పరమంత్రము. వేదము నుండి పుట్టని మంత్రము ఏదీలేదు. కనుకనే, మంత్రము నందు శూద్రులకు అధికారము లేదు. ఇది పరమ నియమము.

శాతాతపసంహిత ప్రకారం శూద్రాధికారము

శాతాతాపసంహిత నందు, శూద్రులకు ప్రతిపాదితమైన మంత్రము యొక్క అంతిమ వర్ణము వరకూ బ్రహ్మహత్యా పాపము కలుగుతుందని చెప్పబడినది. ఈ విషయము స్వయంగా ప్రజాపతియే తెలిపెను.

మంత్రమునందు శూద్రులకు అధికారత్వం

భవిష్యపురాణముననుసరించి, యోగినీ తంత్రము నందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు పవిత్రులు మరియు నిర్మలులు. వీరిలో సంకుచిత ధర్మపరులకు మంత్ర దీక్ష ఇవ్వరాదు. చతుర్వర్ణులు అర్చన చేయగా శుద్ధి, బుద్ధిమంతులవుతారు. గురుదేవ మరియు ద్విజుల సేవయందు నిరంతరము తరిస్తే అప్పుడు చతుర్ధులకు మంత్ర గ్రహణాధికారము లభిస్తుందని చెప్పబడినది.

విష్ణు ఆరాధనందు స్త్రీలకు అధికారము

పద్మపురాణము ప్రకారము విప్రులు, వైదికులు మరియు మిశ్రులు అని రెండు రకములు. భక్త విప్రులు మరియు శూద్రులను తాంత్రికులని అంటారు. శూద్రుల ఆగమోక్తవిధి ప్రకారము వారు పూజలు చెయ్యవచ్చు. ఒక భార్య తన మృత భర్తను విష్ణువుగా తలచుచూ శ్రద్ధగా తన హృదయమునందు అతనిని పూజించవచ్చు. ఇందువలననే విష్ణు ఆరాధనందు స్త్రీలకు అధికారము కలదు. పతిప్రియ కార్యమునందు నిరతురాలయిన స్త్రీకి మంత్రాధికారము కలదు. ఇది సనాతనన శ్రుతివిధానము. ఇక్కడ "పతిప్రియ" అనగా సౌభాగ్యవతి, సుహాసిని అని అర్ధము.

మంత్రరాజము ప్రకారము

ద్విజులకు వేదములందు వారు చేయవలసిన సంస్కారములను పూర్తిగా ప్రతిపాదించబడెను. అందు ఏ విధముగా చెప్పబడినో ఆ విధముగానే ఆచారవిధులు నిర్వహించవలెను. విద్యా సహితముగా స్మరణచేస్తూ అన్ని క్రియలను చేయవలెను. సర్వత్ర తన్మయత్వం వలన సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయము. అన్య వర్ణులు కూడా విద్యారూపముగా ఆచారములను పాటించవలెను.

భవిష్యోత్తర పురాణ ప్రకారము

ఏ స్త్రీ తన భర్త ద్వారా పరిపూర్ణము, పవిత్రము మరియు స్వతంత్రము అవుతుందో ఆ స్త్రీ మంత్ర గ్రహణమునకు అర్హురాలవుతుంది. తన పతి దగ్గర ఉండు స్త్రీ తన పతి ఆజ్ఞానుసారము మంత్రమును గ్రహించవచ్చు. తన స్వధర్మమును పాటించకుండా ఏ దేవతారాధన చేసినా ఆ కర్మ కాగితపు ఇల్లు లాగ వెంటనే ధ్వంసమవుతుంది.

కులార్ణవము ప్రకారము

కులార్ణవముననుసరించి రుద్రయామలమునందు ఈ విధముగా చెప్పబడెను. విధవరాలు పుత్రుని అనుజ్ఞ ద్వారా, కన్య తండ్రి అనుజ్ఞ ద్వారా, భార్య తన భర్త అనుజ్ఞ ద్వారా మంత్రమును గ్రహించవచ్చు. స్త్రీలకు మంత్రమును గ్రహించడానికి స్వతహాగా అధికారము లేదు. శూద్రులకు మరియు స్త్రీలకు చివర "నమః" ఉన్న మంత్రములు శుభదాయకములు. ఇది తెలుసుకొని చండాలునికి కూడా దీక్ష ఇవ్వవచ్చును.

రుద్రయామల ప్రాసాద మంత్రము

శుచివ్రతధారీ, ధార్మిక, ద్విజసేవక, ప్రతివ్రతాస్త్రీ, ప్రతిలోమజ (=నిమ్నవర్ణ పురుషునికి-ఉచ్ఛవర్ణ స్త్రీకి పుట్టినది), అనులోమజ (=ఉచ్ఛవర్ణ పురుషునికి- నిమ్నవర్ణ స్త్రీకి పుట్టినది), చండాలునికి, భూమిమీదున్న ప్రతిఒక్కరికి మంత్ర గ్రహణాధికారము కలదు. ఎవరి జాతి ధర్మమును బట్టి ఆయా జాతులకు ఉపదేశము ఇవ్వవచ్చు. శూద్రులు మరియు స్త్రీలు వైదిక మంత్ర జపము ఎన్నడూ చెయ్యరాదు. వీరికి నమోన్త శివ మంత్రము గానీ వైష్ణవ మంత్రము గానీ శుభదాయకము.

శూద్రులకు ప్రణవాది మంత్ర నిషిద్ధములు

ఏ ద్విజుడు స్వాహా మరియు ప్రణవయుక్త మంత్రములను శూద్రులకు ఇచ్చునో ఆ ద్విజుడు నరకమునకు పోవును. విప్ర శూద్రత్వం ప్రాప్తించునని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.

యామలము ప్రకారము

ఐదు సంవత్సరముల వరకు యోగ్యతను పరిశీలించి అప్పుడు గుణవంతుడైన భక్తునకు మంత్రదానము చెయ్యాలి. సంకరజాతునకు కూడా మంత్రమును ఇవ్వవచ్చు. ఈ ప్రకారముగా బ్రాహ్మణుని ఒక సంవత్సరము, క్షత్రియుని రెండు సంవత్సరములు, వైశ్యుని మూడు సంవత్సరములు, శూద్రుని నాలుగు సంవత్సరములు మరియు సంకరుని అయిదు సంవత్సరములు పరీక్షించిన తర్వాత మంత్ర దానము చెయ్యాలి.
                                                                           ఇంకాఉంది...