సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, సెప్టెంబర్ 2021, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 05

 31. కామరాజలోపాముద్రయోర్విశేషః

కుళోఙ్గీశము నందు కామరాజ లోపాముద్ర విషయము గురించి విశేష కథనము చెప్పబడినది. కామరాజ లోపాముద్రకు ముందు క్లీంహ్రీంశ్రీం, హ్రీంశ్రీంక్లీం, శ్రీంహ్రీంక్లీం జోడించగా మూడు ప్రకారముల అష్టదశాక్షరి విద్య అవుతుంది. క్లీంఐంశ్రీం బీజములు శ్రీభగవదాచార్య ద్వారా ప్రతిపాదించబడినవి.

29, సెప్టెంబర్ 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 17

 

పదిహేడవ భాగము

వజ్రేశ్వరీ పూజా విధివివరణం

మంత్రము - హ్రీం క్లిన్నే ఐం క్రోం నిత్యమదద్రవే హ్రీం

ఋషి - బ్రహ్మ| ఛందస్సు - విరాట్| దేవతా - వజ్రేశ్వరి| క్రోం - బీజం| ఐం - శక్తిః| నే - కీలకం|

షడంగన్యాసం: హ్రీం| క్లిన్నే| ఐం| క్రోం| నిత్యమదద్రవే| హ్రీం| ఈ బీజముల ద్వారా షడంగన్యాసం చెయ్యాలి.

24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 04

 25. సంపుట లక్షణము

నవరత్నేశ్వర ప్రకారము మంత్రమునకు ముందు బీజములను మంత్రమునకు తర్వాత విపరీత క్రమములో జోడించగా మంత్రము సంపుటితమవుతుంది. ఈ సంపుటిత లక్షణము సమస్త శాస్త్రములందు వేరువేరుగా ఉన్నది.

21, సెప్టెంబర్ 2021, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 16

 

సంజీవనీయజన విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే మహేశానీ! ఇప్పుడు పరాత్పర మృత్యుంజయ వర్ణన వినుము. ఈ మంత్ర స్వరూపము ఈ విధంగా ఉండును -

17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 03

 11. కామదేవ ఉపాసిత శ్రీవిద్య

భగవాన్ శివుడు శ్రీదేవితో ఇలా పలికెను- (జ్ఞానార్ణవముప్రకారము)

పంచాక్షర వాగ్భవ కూటము - కఏఈలహ్రీం| షడాక్షర కామరాజ కూటము - హసకహలహ్రీం| చతురక్షర శక్తి కూటము - సకలహ్రీం| శ్రీదేవి సర్వతీర్థమాయీ, సర్వదేవ స్వరూపిణి. సర్వసాక్షిమయి, నిత్యా, సర్వయోనిమయీ, సర్వజ్ఞానమయీ, సర్వప్రజ్ఞానరూపిణీ, సర్వదేవమయీ, సాక్షాత్ సర్వసౌభాగ్యసుందరీ అయిన ఆమె పరా| ఓ దేవీ! ఈ మంత్రమును ఉపాసించే కామదేవుడు సర్వాంగ సుందరుడైనాడు.

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 15

 సంజీవనీవిద్యా వివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే దేవీ! నేను ఇప్పటికీ నా పశ్చిమ ముఖము నుండి సాక్షాత్ అమృతానంద విగ్రహ విద్యాచతుష్టయమును జపిస్తాను. దీనినుండి మహాసింహాసనగత సంజీవనీ విద్యను వినుము.