షడాధారవిద్య
1. పరమేశ్వర మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరహస్రౌఃఐంఫ్రేం| ఆజ్ఞా చక్రమునందు న్యాసము చెయ్యాలి.
షడాధారవిద్య
1. పరమేశ్వర మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరహస్రౌఃఐంఫ్రేం| ఆజ్ఞా చక్రమునందు న్యాసము చెయ్యాలి.
పరాషోడశీ శ్రీచక్ర పూజా
విధి
షోడశీ మంత్రములు ముఖ్యముగా అయిదు విధములు. అవి రమా షోడశీ, పరా షోడశీ, కామాది షోడశీ, వామాది
షోడశీ, శక్త్యాది షోడశీ. ఈ షోడశీ మంత్రముల ఆవరణ దేవతలు వేరువేరుగా ఉంటారు. ఆయా దేవతల
పూజ శ్రీచక్రము లోనే నవావరణ పూజగా చెయ్యాలని కులాగమములో చెప్పబడినది. ఈ రోజుల్లో
శ్రీచక్ర పూజ అంటే ఖడ్గమాల స్తోత్రంలో స్తుతించబడిన దేవతల ఆరాధన గానే చాలా మందికి
తెలుసు. కానీ అదే శ్రీచక్రం లో షోడశీ మంత్ర భేదమును బట్టి ఆవరణ దేవతలు మారుతారు.
షోడశీ ఉపాసకులకు మరియు ఔత్సాహికులకు ఈ పూజా విధానము
అందుబాటులోకి ఉండాలనే సంకల్పంతో ఈ పుస్తకంలో పరా షోడశీ నవావరణ పూజా విధానం ఇవ్వడం
జరిగింది. ఈ పూజా విధానం సంప్రదాయ శ్రీచక్ర పూజా విధంగానే ఉంటుంది. ఉపాసకుల
సౌకర్యార్థం మిగతా షోడశీ ఆవరణ దేవతల వివరాలు ఈ పుస్తకం చివర్లో ఇవ్వబడ్డాయి. ఆయా
మంత్రాలతో పూజ చేసుకోదలచిన వారు ఆయా దేవతలను మార్చుకోవాలి.
ఈ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చెయండి devullu.com
ఘటార్గళయంత్రసాధనవివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే ప్రియే! బిందు నాద కళతో యుక్తమైన ముఖవృత్తము (ఆ) ను పాశము అని అంటారు. కామ (క), అగ్ని, (ర), తార (ఓం)లతో యుక్తమైన అంకుశమును క్రోం అంటారు. ఈ రెండింటి మధ్య హ్రీం ను చేర్చి సురేశ్వరిని పూజించాలి. మంత్ర స్వరూపము “ఆంహ్రీంక్రోం”. దీనినే ఘాటార్గలోద్దారము అని అంటారు. వృత్తము, రెండు భూపురముల సంయోగముతో అష్టకోణము నిర్మించాలి. ఆ అష్టకోణముల అగ్రభాగమున రేఖలను సాగదీయాలి. అప్పుడు రెండు రేఖలతో ఒక సుందరమైన అర్గళము (=ద్వారము, గడియ) ఏర్పడుతుంది. మొదటి అర్గళము ఎంత పరిమాణంలో ఏర్పడుతుందో మిగతావి కూడా అంతే పరిమాణంలో ఏర్పరచాలి. ఆ తర్వాత చంద్రబింబము వంటి సుందరమైన ఒక బింబమును (వృత్తమును) నిర్మించాలి. మళ్ళీ రేఖలను సాగదీసి ఉత్తమ వృత్తమును నిర్మించి క్రమంగా రెండు అష్టకోష్టములను నిర్మించాలి. ఇది ఎలా చేయాలంటే 16 కేసరములు స్పష్టంగా కనిపించాలి. దీని అగ్రభాగము ఎంత సుందరముగా ఏర్పరచగలమో అంత సుందరముగా దానిని ఏర్పరచాలి. ఇది త్రిలోకములను ఆకర్షించబడును.
25. మహాషోఢాన్యాసఫలము
కులార్ణవమునందు భగవాన్ శంకరుడు మహాషోఢాన్యాసమును తెలిపెను. ఎవరైతే ఈ న్యాసములు చేస్తారో వారు సాక్షాత్ పరమశివుడవుతారు. ఎవరు ఈ న్యాసములను ప్రతిరోజూ చేస్తారో వారికి నిగ్రహానుగ్రహ సమర్థత కలుగుతుంది. ఇందు సందేహము లేదు. దేవతలందరూ అతడికి నమస్కారము చేస్తారు. ఏ స్థలములో ఈ న్యాసములు చేయబడునో ఆ స్థలము నాలుగు దిక్కులందునూ, పదియోజనముల వరకు దివ్యక్షేత్రము అవుతుంది. ఈ న్యాస సాధకుడు ఎక్కడకు వెళ్ళినా అతనికి విజయ లాభము, సన్మానము, గౌరవము లభించును. ఈ న్యాస సాధకుడు ఎవరికైనా వందనము చేస్తే అతడు ఆరు మాసములలో మృతిచెందుతాడు. ఈ న్యాసముకు వజ్ర పంజరన్యాసమని పేరు. ఈ న్యాస సాధకుడిని చూసిన, దివ్యలోకములు, అంతరిక్షము, భూమి, పర్వతము, జలము, వనములందు జీవించువారలకు, ప్రచండ భూత, భేతాళ, దేవ, రాక్షస, గ్రహాదులకు భయము కలుగును. ఈ న్యాస సాధకునకు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, ఋష్యాది మునులు నమస్కారము చేయుదురు. ఈ న్యాసమును అనధికారులకు చెప్పరాదు. ఈ న్యాసము వలన ఆజ్ఞాసిద్ధి లాభిస్తుంది. దేవతాభావ ప్రాప్తి కొరకు ఈ న్యాసమును మించిన మరియొక సాధనము లేదు. ఇది సత్యము. ఊర్ధ్వామ్నాయ ప్రవేశము, పరాప్రాసాదధ్యానము, మహాషోఢా న్యాసము/జ్ఞాన ఫలము దేనికీ సాటిరావు.
భువనేశ్వరీద్వాదశగుణితోద్ధారవివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే ప్రియే! ఇప్పుడు త్రిగుణిత యంత్రమునకు మూడురెట్లు ఫలమునిచ్చే యంత్రమును చెబుతాను. దీనిని తెలుసుకున్నంతనే సాధకుడు భువనములకు స్వామి అవుతాడు. ముందు షట్కోణము గీసి ఆ షట్కోణము సంధులను భేదించే విధంగా రెండవ షట్కోణమును గీసినచో ద్వాదశ కోణములు ఏర్పడును. ఆ యంత్ర మధ్యన శక్తిని లిఖించి ఠఃఠః లతో సంపుటీకరించి వాటి బయట విలోమ క్రమంలో వ్యాహృతీలతో వేష్టితము చెయ్యాలి. షట్కోణ సంధులలో ద్వాదశ స్థానములలో భువనేశ్వరీ బీజమును లిఖించాలి. బయట 12 సార్లు శక్తి బంధనము చెయ్యాలి. ద్వాదశకోణములలో హుం ను లిఖించాలి. దానిని పైన బయట కోణములలో సర్వకామసిద్ధి కొరకు బిందు సహిత తురీయ స్వరము ఈం ను లిఖించాలి.
23. మాతృకాన్యాసం
ఓం ఐం హ్రీం శ్రీం హ్సౌం (4) కంఖంగంఘంఙo అనంతకోటి భూచరి కులసహితాయై ఆంక్షాం మంగళాదేవ్యై ఆంక్షాం బ్రహ్మణ్యంబాదేవ్యై అనంతకోటి భూతలకులసహితాయై అంక్షం మంగళనాథాయ అంక్షం అసితాంగభైరవనాథాయ నమః – మూలాధారే|