సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, మే 2018, గురువారం

శ్రీవిద్యా ప్రకాశిక - శ్రీయాగ కర దీపిక


SriVidya Prakashika (Telugu Edition) 









A Detailed Description on SRIVIDYA MANTRA,YANTRA,TANTRA and SriYaga Procedure which deals the detailed Ritualistic procedure of SriChakra Navavarana. This book is composed based on Dakshinachara Sampradaya

Description of "SRIVIDYA PRAKASHIKA"
శ్రీవిద్య మంత్ర,యంత్ర,తంత్రములను గూర్చి శ్రీచక్ర నవావరణ పూజయైన శ్రీచక్రయాగమును గూర్చిసవివరముగా కూర్చబడిన గ్రంథం ఈ శ్రీవిద్యా ప్రకాశిక. దక్షణాచార సంప్రదాయంలో శ్రీయాగక్రమం, పాత్రాసాధన, ముద్రలు, హోమవిధానంతో పాటుగా విశ్లేషణాత్మకంగా వివరించడమైనది. దక్షణాచార సాధకులకు ఈ కల్పం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే సంకల్పంతో పుస్తకం ముద్రించబడుతుంది.


ఈ పుస్తకం కొరకు ఈ క్రింది వారిని సంప్రదించండి

devullu.com






19, మే 2018, శనివారం

శ్రీవిద్యోపాసన - 2


మంత్రసంకేతంః

శ్రీవిద్యోపాసనకు ప్రధానమైన అంగం మంత్రము. ఇదే పంచదశాక్షరి మంత్రం. ఈ మంత్రము వేదములో పరోక్షంగా చెప్పబడింది. వేదంలో చెప్పబడిన ఎన్నో మంత్రాలలో గాయత్రి మరియు పంచదశాక్షరి చాలా ముఖ్యమైనవి. గాయత్రిని ప్రకటగాయత్రి అని, పంచదశాక్షరిని అప్రకటితి గాయత్రి అని అంటారు. ప్రకట గాయత్రి మూడు వర్ణాలవారికి అందులోను మగవారికి మాత్రమే తండ్రిద్వారా ఇవ్వబడుతుంది. అదే అప్రకట గాయత్రి గురువుద్వారా అర్హులైన వారికి కుల, లింగ భేదములు లేకుండా ఇవ్వబడుతుంది. అయితే ప్రకటగాయత్రిని వేదమంత్ర రూపంగా ఉపదేశపడగా, అప్రకటగాయిత్రి మాత్రం సంకేత పదాల రూపంలో ఉపదేశపడుతుంది. ఈ సంకేత పదాలనే బీజాక్షరాలని అంటారు. ఈ మంత్రం రహస్యంగా గురుపరంపరగా ఉపదేశపడుతుంది. ఈ కారణాలవలననే ఈ మంత్రాన్ని అప్రకటిత గాయత్రి అని, రహస్యం అని అంటారు.

మంత్రంయొక్క అర్ధం, ఉపాసనాదేవత, మంత్రఉచ్ఛారణాకాలం, పద్ధతి మొదలైన సాంకేతక విషయాలను వివరించేదే మంత్ర సంకేతం. ఈ వివరణలన్నీ శ్రీభాస్కరరాయలువారు తమ వరివస్యారహస్యం అన్నగ్రంధంలో చాలా విస్తారంగా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మంత్రం గురించి చాలా క్లుప్తంగా మాత్రం చర్చించుదాము.

ఇక్కడ మంత్రము అంటే పంచదశాక్షరి మంత్రము. ఈ మంత్రమందు పదిహేను బీజాక్షరములుండడం వలెనే ఈ మంత్రాన్ని పంచదశాక్షరి అని అంటారు. ఈ మంత్రమందు దేవతా పేరు ఉండదు. ఈ పంచదశాక్షరి మూడు కూటములుగా ఉంటుంది. శ్రీలలితారహస్యనామములందు చెప్పబడిన “శ్రీమద్వాగ్భవకూటైకాస్వరూపముఖపంకజా“, “కంఠాధఃకటిపర్యంతామధ్యకూటస్వరూపిణీ“, “శక్తికూటైకతాపన్నాకట్యదోభాగధారిణీ “ అన్న మూడునామములందు ఈ పంచదశాక్షరి మంత్రమును చెప్పబడినది. మూలమంత్రములో ఉన్న మొదటి కూటమి అమ్మవారి ముఖపంకజముగా, రెండవకూటమి అమ్మవారి కంఠమునుండి కటివరకుగా, మూడవకూటమి కటినుండి పాదములవరకుగా భావించాలి.
సూక్ష్మంగా చూస్తే, మొదటికూటమి అర్ధం ఇలా ఉంటుంది. “చిఛ్చక్తిరూపమైన అమ్మా (ఏ) అవిద్యవలన పుడుతున్న(క) బ్రహ్మకు భిన్నుడను భేదభావమును (హ్రీం) తొలగించు (ఈల)“. జాగ్రత్తగా గమనిస్తే జీవభావాన్ని తొలగించమని అమ్మని ప్రార్ధించడం ఇక్కడ కనిపిస్తోంది. ఈ జీవభావమే మహావాక్యంలో చెప్పబడిన “త్వం”.

ఇప్పుడు రెండవ కూటమిని అర్ధంచేసుకుందాము. అంతా పరివ్యాప్తమైఉన్న (హల) బ్రహ్మము(క) అన్న స్థితికి నన్ను (హస) చేర్చుము (హ్రీం). “నేను బ్రహ్మముఅని తెలియజేయుము” అని అర్ధం. మొదటి కూటమి ద్వారా అవిద్య తొలగబడగా ఇప్పుడు సాధకుడు తనే బ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇక్కడ అలా తెలుసుకోబడిన ఆ బ్రహ్మమే మహావాక్యంలో చెప్పబడిన “తత్“.

ఇక మూడవకూటార్ధము చూడగా, ఆ విధంగా తెలుసుకోబడిన నా స్వరూపమందు ఎల్లప్పుడూ ఉండునట్టుగా చేయుము (సకలహ్రీం) అని అర్ధం. అనగా అది నేనే అయ్యి ఉన్నాను. ఈ భావమే మహావాక్యంలో చెప్పబడిన “అసి”. మొత్తంగా చూస్తే తత్త్వమసియే పంచదశాక్షరి అని అర్ధం అవుతోందికదా.

ఈ మంత్రమునకు వైదిక మంత్రములలాగే స్వరయుక్తముగా జపవిధానం కూడా కలదు. ఇలా ఎన్నో రహస్యాలు కలవు. అవి గురుముఖతః తెలుసుకోదగినవే. ఇలా ఏ సాధకుడు రహస్యాలను తెలుసుకొని సాధన చేస్తాడో అతడు సాక్షాత్తు పరబ్రహ్మమే అవుతాడు.

అయితే చాలామంది మంత్రమును తెలుసుకొని (అంటే ఒక పుస్తకంచూసో, అంతర్జాలంలో చూసో, ఎవరి దగ్గరైనా ఫోన్లో తెలుసుకొనో) మంత్రం జపం చేస్తుంటారు. సశాస్త్రీయంగా గురువుదగ్గర ఉపదేశం తీసుకొని మంత్రానుష్టానం చేసేవారు చాలా తక్కువ. వారిలో కూడా చాలామంది ఉపదేశం తీసుకొని రహస్యాలు తెలుసుకోకుండా ఏదో గొప్ప సాధన చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. అవన్నీ తమని గురువే పిలిచి తమకు చెప్పాలని అనుకుంటుంటారు. ఇదంతా సాధన అన్న ముసుగులో అహంకారపూరితమైన ప్రవర్తనే తప్ప మరేమీ కాదు. నిజానికి మన సాధన, నడవడిక అహంకారరహితమై ఉండాలి. అప్పుడే రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. అప్పుడు గురువును సమీపించి అత్యంత వినమ్రతతో సాధనా రహస్యాలు తెలుసుకోవాలి.

ఇప్పుడు చక్రసంకేతం తెలుసుకుందాము.

(ఇంకాఉంది)

14, మే 2018, సోమవారం

శ్రీవిద్యోపాసన - 1



శ్రీచక్రపూజా లేదా పరాపరపూజ అత్యంత ఉన్నతమైన పూజావిధానము. జీవాత్మ పరమాత్మతో నిరంతరంగా ఏకీభూతమైనట్టుగా భావించుకుంటూ ఉండడమే శ్రీవిద్యోపాసన. పూజ అనునది మూడు రకములు. 1) పరాపూజ 2) అపరాపూజ 3) పరాపరపూజ.

రెండవదిలేదు అనగా ప్రతీమాట, ప్రతీ ఆలోచన అంతా అద్వైతభావనతోనే చేసే పూజనే పరాపూజ అంటారు. ఇది ఎంతో ఉన్నతమైనది.

తనకు భిన్నంగా ఇంకొకటి ఉన్నాది అని తలచి అనగా ద్వైతభావనతో తన ఎదురుగా శ్రీచక్రమునో లేక మరియొక విగ్రహాన్నో పెట్టుకొని చేసే పూజనే అపరాపూజ అని అంటారు. ఇది సాధారణ పూజ.

ద్వైతంతో మొదలుపెట్టి అద్వైతంతో ముగించేపూజ పరాపరపూజ. ఇది మధ్యస్తమైన పూజ.

ఏ సాధకుడి ఆలోచనలు, హృదయం అతడి బాహ్యస్మృతినివీడి ఎల్లప్పుడూ పరబ్రహ్మమందు నిలచిఉంటుందో అదే పరాపూజ. దీనినే ఋతంభరప్రజ్ఞ అని అంటారు. ఈ పూజ అంతా మానసికంగానే జరుగుతుంది. ఇది అందరికీ సాధ్యంకాదు. అలా సాధ్యం చేసుకున్నవారినే ఉత్తమాధికారులు అని అంటారు. వీరు ఎల్లప్పుడూ సచ్చిదానందరూపులై ఉంటారు.

మనసులో గూడుకట్టుకున్న ద్వైతభావనలను నిరంతర సాధనద్వారా అద్వైతభావనలోకి తీసుకు వెళ్ళగలగడమే పరాపరపూజ. ఈ సాధకులను మధ్యమాధికారులని అంటారు. కొంచెం అర్ధమైన రీతిలో చెప్పాలంటే బాహ్యపూజనుండి అంతఃపూజలోకి ప్రయాణంచేయడమే పరాపరపూజ.

తను బ్రహ్మమునకు భిన్నుడని భావించి తన ఎదురుగా ఒకఛాయను అనగా శ్రీచక్రాన్నో, విగ్రహాన్నో ఏదైనా పెట్టుకొని పూజా సామాగ్రి సమకూర్చుకొని కల్పసూత్ర ప్రకారంగా మంత్రములను చదువుతూ చేసెడి బాహ్యపూజను అపరాపూజ అని అంటారు. ఈపూజను, సాధన ప్రారంభదశలో ఉన్నవారుగాని, మధ్యమాధికారులు గాని పాటిస్తారు.

నిజానికి సాధారణ సాధకులకు పరాపూజ వెంటనే అబ్బదు. దానికి ఎంతో పూర్వజన్మ సాధనాపుణ్యఫలం ఉండి తీరాలి. ఉదాహరణకు భగవాన్ శ్రీరమణ మహర్షి. ఆయన పూర్వజన్మల పుణ్యఫలంవల్లనే ఈ జన్మలో పరాపూజా తత్పరులు అయ్యారు. అందరూ ఆయనవంటి వారు కాలేరు. కాని ప్రయత్నిస్తే తప్పకుండా ఆ స్థాయికి చేరగలరు.

కాని పరాపూజాధికారం రావాలంటే అపరాపూజలో నిష్ణాతులు కావాలి. ఏ సాధకుడైతే నిరంతర తపన, పట్టుదల, దీక్ష, గురుభక్తి, సాధన కలిగిఉంటాడో అతడు తప్పక ఆధ్యాత్మికంగా ఎదుగగలడు. ఇది తధ్యం.


పూజయే యజ్ఞము. అయితే శ్రీచక్రోపాసన ఏదో మనకు ఇష్టం వచ్చినప్పుడు, ఏదో కాళీగా ఉన్నాముకదా అని అప్పుడప్పుడు చేసేది కాదు. అది నిరంతర ఉపాసన. శ్వాసతో పాటుగా జరగవలసిన ఉపాసన. జీవాత్మను పరమాత్మగా తెలుసుకోవడమే శ్రీవిద్యోపాసన లక్ష్యం. శ్రీవిద్యోపాసనకు మూడు అంగాలున్నాయి. వాటినే సంకేతాలంటారు. అవి మంత్రసంకేతం, చక్రసంకేతం, పూజా(తంత్ర)సంకేతం. ఇప్పుడు మనం ఈ సంకేతాలని క్లుప్తంగా అర్ధం చేసుకుందాం.

(ఇంకాఉంది)

10, మే 2018, గురువారం

ఋగ్వేద మాధ్యాహ్నిక సంధ్యావందనమ్


ఋగ్వేద మాధ్యాహ్నిక సంధ్యావందనమ్

ఓం గణానాం”త్వా గణప’తిగ్ం హవామహే కవింక’వీణాం ము’పమశ్ర’వస్తమం|
జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పత ఆన’శ్శృణ్వన్నూతిభిః’స్సీదసాద’నం||
శ్రీమహాగణాధిపతయే నమః|

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా,
యఃస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యన్తరశ్శుచిః.

పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయనమః

ఆచమనంః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఆసన స్వీకారముః

ఓం పృథివ్యాః। పృధ్వీతిమంత్రస్య। మేరుపృష్ఠఋషిః। కూర్మోదేవతా। సుతలం ఛందః। ఆసనేవినియోగః॥
ఓం పృధ్వీత్వయాధృతాలోకా దేవీత్వం విష్ణునాధృతా। త్వంచధారయమాం దేవి పవిత్రం కురుచాసనం॥  ఓం అనంతాసనాయనమః।

(కుడిచేతి అంగుష్ఠ, అనామికలతో భూమిని స్పృశించవలెను)

ప్రాణాయామము

1)    ప్రణవస్య। పరబ్రహ్మఋషిః। పరమాత్మా దేవతా। దైవీగాయత్రీఛందః।
2)    శ్రీగాయత్రీ పూర్వాంగ సప్తవ్యాహృతి మంత్రాణాం, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వసిష్ఠ, కశ్యపా ఋషయః, అగ్ని, వాయు, సూర్య, వాగీశ, వరుణ, ఇంద్ర, విశ్వేదేవా దేవతాః, గాయత్రి, ఉష్ణి, గనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్ జగతి, ఛందాంసి.
3)    గాయత్య్రా॥ విశ్వామిత్ర ఋషిః। సవితా దేవతా। గాయత్రీ ఛందః॥

ప్రాణాయామే వినియోగః

ఓం భూః। ఓం భువః। ఓం స్వః। ఓం మహః। ఓం జనః। ఓం తపః। ఓం సత్యం।

ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|

ఓమాపోజ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం|

దేశకాలసంకీర్తనం
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం, శుభాభ్యాం శుభే శోభనముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, పథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన…………..
సంవత్సరే, ……………ఆయనే, ……………….ఋతౌ, ………మాసే,…………పక్షే, …………..తిథౌ,………….
……………..వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ,
శ్రీమాన్ ……………….గోత్రః ……………………నామధేయః (ధర్మపత్నీ సమేతోహం), శ్రీమతః ……………….. గోత్రస్య…………………………శర్మణః, (ధర్మపత్నీ సమేతస్య) మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం మాధ్యాహ్నిక సంధ్యాముపాశిష్యే.


మార్జనంః

ఆపోహిష్టేతి తిస్రూణాం” మంత్రాణాం| అంబరీష సింధుద్వీ’ప ఋషిః| ఆపోదేవతా| గాయత్రీ ఛందః,
మార్జనే వి’నియోగః|

ఓం 1) ఆపోహిష్ఠామ’యోభువః’|    2) తాన’ ఊర్జే ద’ధాతన|  3) మహేరణా’’య చక్ష’సే|                        
4) యోవ’శ్శివత’మో రసః|    5)  తస్య’ భాజయతే హనః’|   6) ఉశతీరివ’ మాతరః’|   7) తస్మా
అరం’’గమామవో |    8) యస్యక్షయా’’యజిన్వథ|    9) ఆపో’’జనయ’థాచనః|

మంత్రాచమనం

ఆపఃపునంతి ఇత్యస్య మంత్రస్య। పూర ఋషిః। ఆపోదేవతా। అనుష్టుప్ ఛందః। మన్త్రాచమనే వినియోగః।

ఓం ఆపః’ పునన్తు పృథివీం పృ’థివీ పూతా పు’నాతుమాం। పునన్తు బ్రహ్మ’ణస్పతిర్బహ్మ’ పూతా పు’నాతుమాం।
యదుచ్ఛి’ష్టమభో’’జ్యం యద్వా’’ దుశ్చరి’తం మమ’। సర్వం” పునన్తు మామాపో’’ఽ సతాంచ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా”।

ఆచమనంః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

పునర్మార్జనం
ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య| అమ్బరీషపుత్రః సింధుద్వీప ఋషిః| పంచమీ వర్ధమాన| సప్తమీ ప్రతిష్ఠా| అంతేద్వే అనుష్టుభౌ| ఆపో దేవతా| పునర్మార్జనే వినియోగః||
ఓం
1)     ఆపోహిష్ఠామ’యో భువస్తాన’ ఊర్జేద’ధాతన| మహేరణా”య చక్షసే|
2)    యోవ’ శ్శివత’మో రస స్తస్య’భాజయతే హనః’| ఉశతీరి’వ మాతరః’|
3)    తస్మా అరం’’గమామవో యస్యక్షయా’’య జిన్వ’థ| ఆపో’’ జనయ’థాచనః|
4)    శంనో” దేవీరభిష్ట’య ఆపో” భవన్తు పీతయే’’| శంయో రభిస్ర’వంతునః|
5)    ఈశా’’నా వార్యా’’ణాం క్షయం’’తీశ్చర్షణీనాం| అపోయా’’చామి భేషజం|
6)    అప్సుమే సోమో” అబ్రవీదంతర్విశా”ని భేషజా| అగ్నించ’ విశ్వశం’’భువం|
7)    ఆపః’ పృణీత భే’’షజం వరూ’థం తన్వే” 3 మమ’| జ్యోక్చసూర్యం”దృశే|
8)    ఇదమా”పః ప్రవ’హత యత్కించ’ దురితం మయి’| యద్వాహమభిదుద్రోహ యద్వాశేప
ఉతానృతం|
9)    ఆపో” అద్యాన్వ’చారిషం రసే”న సమ’గస్మహి| పయ’స్వానగ్న ఆగ’హితం మాసం
సృ’జవ’ర్చసా|
10)  సస్రు’షీస్త’దప’సోది’వాన’క్తంచ సస్రు”షీః| వరే”ణ్యక్రతురహమపోదేవీ రుప’హ్వయే|

అఘమర్షణమంత్రము
ఋతంచ సత్యంచేత్యస్య సూక్తస్య| అఘమర్షణ ఋషిః| భావవృత్తో దేవతా| అనుష్ఠుప్చంధః| పాపపురుష జల విసర్జనే వినియోగః||
1)    ఋతంచ’ సత్యంచాభీ”ద్ధాత్తపసోఽధ్య’జాయత| తతో రాత్ర్య’జాయత తతః’ సముద్రో అ”ర్ణవః||
2)    సముద్రాద”ర్ణవాదధి’ సంవత్సరో అ’జాయత| అహోరాత్రాణి’ విదధద్విశ్వ’స్య మిషతో వశీ||
3)    సూర్యాచంద్రమసౌ” ధాతా య’థాపూర్వమ’కల్పయతు| దివం”చ పృథివీం
చాన్తరి’క్షమధోస్వః’|

అర్ఘ్యప్రదానముః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

కాలాతిక్రమణమైనచో…
ప్రాతర్దేవీ మిత్రస్య మంత్రస్య। ఉరుచక్రిర్నామాత్రేయ ఋషిః। మిత్రావరుణౌ దేవతా। త్రిష్టుప్ ఛందః। మాధ్యాహ్నిక సంధ్యాంగ ముఖ్య కాలాతిక్రమణ ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రదానే వినియోగః।
ఓం ప్రాతర్దేవీ మది’తిం జోహవీమి మధ్యంది’న ఉది’తా సూర్య’స్య। రాయే మిత్రావరుణా సర్వతాతే”ళే తోకాయ తన’యాయ శంయోః।  (ఒకసారి మాత్రమే)

మాధ్యాహ్నిక అర్ఘ్యప్రధానము.
1)    హంసశ్శుచిషదిత్యస్య మంత్రస్య। గౌతమపుత్రో వామదేవ ఋషిః। సూర్యో దేవతా। జగతీ ఛందః। మాధ్యాహ్నిక సంధ్యాంగ అర్ఘ్యప్రదానే వినియోగః।

ఓం హంసః శు’చిషద్వసు’రన్తరిక్ష సద్ధోతా’’ వేదిషదతి’థిర్ధురోణసత్।  నృషద్వ’రసదృ’త సద్వ్యో’’మసదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతం బ్రుహత్।

2)    ఆకృష్ణేనేత్యస్య మంత్రస్య। హిరణ్యస్తూప ఋషిః। సవితా దేవతా। త్రిష్టుప్ ఛందః। మాధ్యాహ్నిక సంధ్యాంగ అర్ఘ్యప్రదానే వినియోగః।

ఓం ఆకృష్ణేన రజ’సా వర్త’మానో నివేశయ’’న్నమృతం మర్త్యం’’చ। హిరణ్యయే’’న సవితా రథేనాదేవో యా’’తి భువ’నాని పశ్యన్’ ।
3) ఓం తత్సువితురిత్యస్య మంత్రస్య| గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః| సూర్యో దేవతా| గాయత్రీ ఛందః| మాధ్యాహ్నిక సంధ్యాంగ అర్ఘ్యప్రధానేవినియోగః||
ఓం భూర్భువస్వః’| ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|

ఆత్మప్రదక్షిణముః
అసావా’దిత్యోబ్రహ్మ|

తర్పణాలుః

సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి

గాయత్రి ఉపాసనముః

ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ| అగ్నిర్దేవతా బ్రహ్మ’ఇత్యార్షం| గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపం|
సాయుజ్యం వి’నియోగం|
ఆయా’తువర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమి’తమ్| గాయత్రీం” ఛన్ద’సాం మాతేదం బ్ర’హ్మజుషస్వ’మే| యదహ్నా”త్కురు’తేపాపం తదహ్నా”త్ప్రతిముచ్య’తే| యద్రాత్రియా”త్కురు’తేపాపం తద్రాత్రియా”త్ప్రతి ముచ్య’తే| సర్వ’వర్ణేమ’హాదేవీ సంధ్యావి’ద్యే సరస్వ’తి|
ఓజో’ఽసి సహో’ఽసి బల’మసి భ్రాజో’ఽసి దేవానాం ధామనామా’ఽసి విశ్వ’మసి విశ్వాయు స్సర్వమసి సర్వాయు రభిభూరోం గాయత్రీ మావా’హయామి, సావిత్రీ మావా’హయామి, సరస్వతీ మావా’హయామి, ఛన్దర్షీ నావా’హయామి, శ్రియమావా’హయామి, బలమావా’హయామి, గాయత్రియా గాయత్రీ ఛన్దో విశ్వామిత్ర ఋషి స్సవితా దేవతాఽగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణుర్హృదయం రుద్రశిఖా పృథివీయోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాఙ్ఖ్యాయనసగోత్రా గాయత్రీ చతుర్వింశత్యక్షరా త్రిపదా’ షట్కుక్షిః పఞశీర్షోపనయనే వి’నియోగః ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్స’వితుర్వరే’’ణ్యం। భర్గో’’దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచోదయా’’త్|  ఓమాపోజ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం|
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరప్రీత్యర్ధం మాధ్యాహ్నిక సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మహా మంత్రజపం కరిష్యే| ఇతి ఋగ్వేద బ్రహ్మకర్మ సముచ్చయం|
(ఇప్పుడు పంచపాత్రలోని ఉదకమును స్పృశించవలెను)

అంగన్యాస కరన్యాసములు
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే                 -           అంగుష్ఠాభ్యాం నమః     -   హృదయాయ నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే                            -           తర్జనీభ్యాం నమః        - శిరసే స్వాహా
భర్గోదేవస్య రుద్రాత్మనే                       -           మధ్యమాభ్యాం నమః   - శిఖాయై వషట్
ధీమహి సత్యాత్మనే                              -           అనామికాభ్యాం నమః  - కవచాయహుం
ధియోయోనః జ్ఞానాత్మనే                      -           కనిష్ఠికాభ్యాం నమః      - నేత్రత్రయాయ వౌషట్
ప్రచోదయాత్ సర్వాత్మనే                    -           కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయఫట్              
బూర్భువస్సువరోమితి దిగ్బంధః
ధ్యానంః

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం. గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే.
ముద్రలుః

సుముఖం సంపుటంచైవ వితతం విశ్రుతం తథా| ద్విముఖం త్రిముఖం చైవా చతుఃపంచ ముఖం తథా| షణ్ముఖోధోమకంచైవ వ్యాపికాంజలికంతథా| షకటం యమపాశంచ గ్రథితం చోల్ముఖోల్ముఖం| ప్రళంబం ముష్టికంచైవ, మత్స్య, కూర్మ, వరాహకం| సింహాక్రాంతం, మహాక్రాంతం, పల్లవం ముద్గరం తథా|
ఇతిముద్రావై చతుర్వింశతి గాయత్రీ సుప్రతిష్ఠితాః| ఏతే ముద్రానజానాతి గాయత్రీ నిష్ఫలాభవేత్|
మంత్రజపం

ఓం భూర్భువస్వః’| ఓం తత్స’వితుర్వరే”ణ్యం| భర్గో”దేవస్య’ధీమహి| ధియోయోనః’ ప్రచో”దయాత్||

అంగన్యాస కరన్యాసములు
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే                 -           అంగుష్ఠాభ్యాం నమః     -   హృదయాయ నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే                            -           తర్జనీభ్యాం నమః        - శిరసే స్వాహా
భర్గోదేవస్య రుద్రాత్మనే                       -           మధ్యమాభ్యాం నమః   - శిఖాయై వషట్
ధీమహి సత్యాత్మనే                              -           అనామికాభ్యాం నమః  - కవచాయహుం
ధియోయోనః జ్ఞానాత్మనే                      -           కనిష్ఠికాభ్యాం నమః      - నేత్రత్రయాయ వౌషట్
ప్రచోదయాత్ సర్వాత్మనే                    -           కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయఫట్              
వస్సువర్భుభూరోం దిగ్విమోకః

వరుణోపస్థానంః

యచ్చిద్దిత ఇతి పంచర్చస్య సూక్తస్య| శునశ్శేప ఋషిః| వరుణోదేవతా| గాయత్రీ ఛందః| వరుణోపస్థానే వినియోగః||

ఓం
1)    యచ్చిద్ధితే విశో’’ యథా ప్రదే”వ వరుణవ్రతం| మినీమసి ద్యవి’ద్యవి|
2)    మానో” వథాయ’ హత్నవే” జిహిళానస్య’ రీరధః| మాహృ’ణానస్య’ మన్యవే”|
3)    విమృ’ళీకాయ’తే మనో” రథీరశ్వం న సంది’తం| గీర్భిర్వ’రుణసీమహి|
4)    పరాహిమే విమ’న్యవః పత”న్తి వస్య’ఇష్టయే| వయోనవ’స తీరుప’|
5)    కదాక్ష’త్రశ్రియం నరమా వరు’ణం కరామహే| మృళీకాయో” రుచక్ష’సం|

మాధ్యాహ్నిక సూర్యోస్థానంః

చితం దేవనా ముదగాదనీకమితిషళర్చస్య సూక్తస్య। ఆంగీరసః కుత్సఋషిః। సూర్యోదేవతా। త్రిష్టుప్ఛందః। సూర్యోపస్థానే వినియోగః।

1) ఉదుత్యం జాతవే”దసం దేవం వ’హన్తికేతవః’। దృశేవిశ్వా’’య సూర్యం’’।
2) అపత్యేతాయవో”యథా నక్ష’త్రాయన్త్యక్తుభిః’। సూరా’’య విశ్వచ’క్షసే।
3) అదృ’శ్యమస్యకేతవో విరశ్మయో తంజనాం అను’। భ్రాజ”న్తో అగ్నయో” యధా।
4) తరణి”ర్విశ్వద’’ర్శతో జ్యోతిష్కృద’సి సూర్య। విశ్వమాభా’’సి రోచనం।
5) ప్రత్యంఙ దేవానాం విశః’ ప్రత్యంగ్ దే’షి మాను’షాన్। ప్రత్యంగ్ విశ్వం స్వ’ర్దృశే।
6)    యేనా’’పావాక చక్షు’సాభురణ్యం తం జనాం అను’। త్వం వ’రుణ పశ్య’సి।
7)    విద్యామే’’షి రజ’స్పృథ్వహామిమా’’నో అక్తుభిః’। పశ్యంజన్మా’’ని సూర్య।
8)    సప్తత్వా’’ హరితో రథే వహ”న్తి దేవ సూర్య। శోచిష్కే’’శం విచక్షణ।
9)    అయు’క్త సప్త శున్థ్యువః సూరో రథ’స్య నప్త్యః’। తాభి’ర్యాతి స్వయు’క్తిభిః।
10)  ఉద్వయం తమ’సస్పరి జ్యోతిష్పశ్యం’’త ఉత్త’రం। దేవం దే”వత్రా సూర్యమగ’’న్మ జ్యోతి’రుత్తమమ్।
11)  ఉద్యన్నద్యమి’త్రమహః ఆరో’హన్నుత్త’రాం దివం’’। హృద్రోగం మమ’సూర్య। హరిమాణం”చనాశయ।
12)  శుకే”షుమే హరిమాణం” రోపణాకా’’సుధద్మసి। అధో’’హారిద్రవేషు’మే హరిమాణం నిద’ద్మసి।
13)  ఉద’గాదయమా”దిత్యో విశ్వే’’న సహ’సాసహ। ద్విషన్తం”రన్ధయన్మో అహం ద్వి’షతే ర’థం।
14)  చిత్రం దేవానాముద’ గాదనీ’’కం చక్షు’’ర్మిత్రస్య వరు’ణస్యాగ్నేః। ఆప్రాద్యావా’’పృథివీ అన్తరి’క్షం సూర్య’ఆత్మా జగ’తస్తస్థుష’శ్చ।
15)  సూర్యో”దేవీ ముషసం రోచ’మానాం మర్యోనయోషా”మభ్యే”తి పశ్చాత్। యత్రానరో’’దేవయన్తో’’ యుగాని’ వితన్వతే ప్రతి’ భద్రాయ’ భద్రం।
16)  భద్రా అశ్వా”హరితః సూర్య’స్య చిత్రా ఏత’గ్వా అనుమాద్యా’’సః। నమస్యన్తో’’ దివ ఆపృష్ఠమ’స్థుః పరిద్యావా’’ పృథివీ య’న్తి సద్యః।
17)  తత్సూర్య’స్య దేవత్వం తన్మ’హిత్వం మధ్యాకర్తోర్విత’తం సంజ’భార। యదేదయు’క్త హరితః’ సధస్థాదాద్రాత్రీ వాస’స్తనుతేసిమస్మై’’।
18)  తన్మిత్రస్య వరు’ణస్యాభిచక్షే సూర్యో’’రూపం కృ’ణుతే ద్యోరుపస్థే”। అనన్తమన్య ద్రుశ’దస్యపాజః’ కృష్ణమన్యద్దరితః సంభ’రన్తి।
19)  అద్యాదే”వా ఉది’తా సూర్య’స్య నిరంహసః’ పిపృతా ని’రవద్యాత్। తన్నో” మిత్రో వరు’ణో మామహన్తా మది’తిః సిన్ధుః’పృథివీ ఉతద్యౌః।

శాన్తిమంత్రము

ఓం నమో బ్రహ్మణే ఇత్యస్య మంత్రస్య। ప్రజాపతి ఋషిః। విశ్వేదేవా దేవతాః। జగతీచ్ఛందః। ఉపస్థానే వినియోగః।

ఓం నమో బ్రహ్మ’ణే నమో’’ అస్త్వగ్నయే నమః’ పృథివ్యై నమ ఓష’ధీభ్యః। నమో’’వాచే నమో’’ వాచస్పత’యే నమో విష్ణ’వే బృహతే క’రోమి। ఓం శాన్తిః శాన్తిః శాన్తిః’।

శుభచింతనముః
ప్రవర చెప్పుకోవలెను.
ఓం ఆచమ్య…
ఓం కేశవా’యస్వాహా, ఓం నారాయణా’యస్వాహా, ఓం మాధవా’యస్వాహా, ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్ధనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః,                      ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
ఆబ్రహ్మలోకాదాశేషాదా లోకాలోకపర్వతాత్ । యేసంతి బ్రాహ్మణాదేవాస్తేభ్యోనిత్యం నమోనమః॥
ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు (జపఫలమును ఈశ్వరునికి అర్పణబుద్ధితో జలమును హరివేణములోనికి విడువవలెను)

ఇతి శివం

26, ఏప్రిల్ 2018, గురువారం

ఛిన్నమస్త


ఛిన్నమస్త



వైశాఖ పౌర్ణమి శ్రీఛిన్నమస్త ఉద్భవించినరోజు సందర్భంగా ఈ దేవతను మనం ఒకసారి స్మరించుకుందాం…

దశమహావిద్యలలో చాలా ప్రశస్తమైన దేవత ఛిన్నమస్త. తన శిరస్సును తానే ఖండించుకున్న దేవతగా ప్రసిద్ది. అలా ఖండించబడిన మొండెమునుండి మూడు రక్తధారలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో మధ్యధారను తానే తన నోటితో త్రాగుతూ ఉంటే ఎడమ, కుడి ధారలను తన చెలికత్తెలైన వర్ణిని, ఢాకినిలు త్రాగుతూ ఉంటారు. ఈ దేవతోపాసన వామాచారమార్గంలో చాలా త్వరగా సిద్ధిపొందుతుంది. ఈ దేవతా మంత్రములో వజ్రవైరోచని అన్న శబ్దము చాలా ముఖ్యమైనది. వజ్రాయుధము ఇంద్రుని ఆయుధము. వజ్రవైరోచని అతని యొక్క శక్తి. ఇంద్రుని భార్య అయిన శచీదేవి ఇంద్రాణి. ఆమెయొక్క భీషణరుపమే ఛిన్నమస్త. మరికొన్ని కధలప్రకారము, జమదగ్ని భార్య అయిన రేణుకాదేవినే ఛిన్నమస్తగా చెబుతారు.

ఈ దేవతా సాధన చాలా రహస్యంగా చేస్తారు. సాధారణంగా వామాచార తంత్రములన్నీ రహస్యంగానే చేస్తారు. శక్తిదేవతలలో ఈదేవతను మించి భయంకరమైన దేవతలేదని కొందరి సాధకుల అభిప్రాయము. శ్మశానంలోగాని, శవంపై కూర్చొనిగాని ఈ దేవతా మంత్రసాధన చేయాలి. చైనాదేశంలో ఈ సాధకులు ఎక్కువగా కనిపిస్తారు. బౌద్ధమతంలో ఈదేవతోపాసన చాలా ప్రాశస్త్యం పొందింది. ఈ దేవతోపాసన వలన కామమును జయించు శక్తి కలుగుతుంది. కాలజ్ఞానం కూడా కలుగుతుంది. పైన చెప్పబడిన మూడు రక్తధారలను సుషుమ్న, ఇడ, పింగళలుగా భావించాలి. దక్షిణాచారపరులు తమ గృహమునందుగాని, దేవాలయమునందుగాని ఈ దేవతాసాధన చేస్తారు. శ్రీగణపతి మునిగారు ఈ దేవతామంత్ర సాధనలో సిద్ధిపొందిన ప్రసిద్ధులు.

(ఈ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన వైశాఖ పౌర్ణమి. దీనినే బుద్ధపూర్ణిమ అని కూడా అంటారు)

16, ఏప్రిల్ 2018, సోమవారం

బగళాముఖి




వైశాఖ శుద్ధచతుర్ధి శ్రీబగళాముఖి ఉద్భవించినరోజు సందర్భంగా ఈ దేవతను మనం ఒకసారి స్మరించుకుందాం…

దశమహావిద్యలలో ఒకటైన బగళాముఖిదేవతను కొంచెం తీవ్రదేవతగాను కొంచెం సాత్వికదేవతగాను పరిగణిస్తారు. స్తంబనవిద్యలలో చాలా ప్రాశస్త్యంపొందిన విద్య. ఈ విద్యను అభ్యసించిన మంత్రోపాసకుని ఎదురుగా నిలచి అతనిని వాదనలో ఎవరూ గెలవలేరు. అలా వాదించేవారి వాక్కు, ముఖం, పాదం మొదలగు అంగములు స్తంబించిపోతాయి. బగళాముఖి దేవత స్వయంగా మంత్రోపాసకుని శత్రువుయొక్క నాలిక తన ఎడమ చేతితో లాగి దానిమీద తన కుడిచేతిన ఉన్న గదతో మోది వారికి మాట రాకుండా చేస్తుందని ప్రతీతి.

ఈదేవత పసుపురంగులో ఉంటుంది. ఈ మంత్రోపాసకుడు పసుపురంగు బట్టలు ధరించి పసుపుపూలతో పూజ, హోమం చేసి పసుపుకలిపిన వంటకములను నైవేద్యంగా పెడితే (పులిహోర, పులగం మొదలగునవి) త్వరగా సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం.
బగళ అన్నశబ్ధం బకల అన్న పదం నుండి పుట్టినట్టుగా తెలుస్తోంది. బకల అనగా కొంగ అని అర్ధం. ఈదేవత ముఖం కొంగముఖంలాగ ఉంటుందని అర్ధమవుతున్నాది. అయితే ఈమె ధ్యానశ్లోకాలలో మాత్రం అలా వర్ణించబడలేదు.

ఈదేవతా ఉపాసన బాహ్యశత్రువుల స్తంబనకేగాక, అంతఃశత్రువుల స్తంబనకు కూడా ఉపయోగించవచ్చు. అయితే నిజమైన సాధకుని లక్ష్యం ఎప్పుడూ అంతఃశత్రువులే అవ్వాలిగాని బాహ్యానికి ఇటువంటి విద్యలను ఉపయోగించుకోకూడదు.

గడచిన సంవత్సరంలోనే దక్షిణభారతదేశంలో ఒక రాజకీయనాయకులు ఈ విద్యాప్రయోగం చేసి కోర్టులందు తమమీద ఉన్న కేసులనుండి తప్పించుకొని ఉన్నతస్థానాన్ని అధిరోహించారు. అయితే అది ఎన్నాళ్ళో నిలవలేదు.

(ఈ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన వైశాఖశుద్ధ చతుర్ధి)