(శివుడు చెప్పుచున్నాడు) -
హే దేవీ! వీటి వైభవ వర్ణమును చెప్పెదను సావధానముగా వినుము. ఇవి తిర్యక్-పైన-క్రింద
స్థానములందు ఆరోహణ, అవరోహణ క్రమములో ఉంటాయి.
సమస్త-వ్యస్త, ప్రతిలోమ-అనులోమ,
అవస్థాత్రయరూపములో వ్యాప్య-వ్యాప్యభేదములో ఉంటాయి. వర్ణగుంఫిత యోగమువలన ఇవి
తైజసమూర్తులవుతున్నాయి. ఇది సూత్రప్రాయముగా కుండలినీ రూపములో ఉంటుంది. 16 స్వరములూ
16 చంద్రునికలలు. మకారమును వదలి మిగిలిన 24 స్పర్శవర్ణములూ సూర్యకలలు. దశవ్యాపకములు
దశ కళలు. ఆరోహణ క్రమములో వీటి సంఖ్య సగము అవుతాయి మరియు అవరోహణమునందు కూడా అంతే
అవుతాయి. ప్రకృతిస్థ సూర్యకలలు వాటి రెండింటికీ సమానమవుతాయి. సోమ-వహ్ని కళలు
అప్రాకృతములు. రెండింటియందు మకారము యొక్క కళలు 76. ఆరోహణ-అవరోహణ క్రమమునందు 28
కళలు. వీటి నిజకళలను పూర్ణమండలము అని అంటారు.