1. 3. అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑
అ॒స్మాన్స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒
విశ్వా’’।
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శంయోః ॥
·
అగ్నే – ఓ దేవా! శ్రీవిద్య పరంగా అగ్ని అంటే చిదగ్ని. అదే పరాశక్తి యొక్క జ్ఞాన
శక్తి. అదే కుండలినీశక్తి
·
త్వంపారయా – మమ్మల్ని దాటించు, రక్షించు. శ్రీవిద్య పరంగా సాధకుడిని మాయ, కర్మ, అవిద్య అనే సంసారసాగరం నుండి పరబ్రహ్మస్థితికి
చేర్చు.
·
నవ్యః – ఉత్తమమైన, శ్రేష్ఠమైన మార్గంలో, శ్రీవిద్య పరంగా – శ్రీవిద్యా
సాధనే ఉత్తమమైన మార్గము.
·
అస్మాన్ – మమ్మల్ని
·
స్వస్తిభిః – శుభమార్గాలతో,
క్షేమాన్ని కలిగించే ఉపాయాలతో, శ్రీవిద్యోపాసనే
శుభమార్గము. పంచదశి, షోడశి, శ్రీచక్రోపాసన మొదలైన శుభమార్గాలలో అది క్షేమమును కలిగిస్తుంది. భోగ-మోక్షకారిణి
విద్య
·
అతి దుర్గాణి విశ్వా – అత్యంత కష్టములను, విపత్తులను, అవరోధాలను. శ్రీవిద్య పరంగా
– ఆణవ, మాయిక, కార్మిక మలములు, అహంకారం, వాసనలు, అవరోధాలు అతి
దుర్గములు.
·
పూశ్చపృథ్వీ బహులాన ఉర్వీ భవా – సమస్త జీవజాలమునకు విశాలమైన భూమి ఏ విధంగా ఆధరమో, రక్షణో ఆ విధంగా మాకు రక్షణగా
ఉండు. శ్రీవిద్య పరంగా చైతన్యం, హృదయ విశాల విస్తృతి. సుషుమ్నా
మార్గములో కుండలినీ శక్తి విస్తారణను ఇక్కడ అన్వయించుకోవాలి.
·
తోకాయ తనయాయ శంయోః – మా పిల్లలు, సంతానం, వంశానికి శుభం, క్షేమం కలిగించు. శ్రీవిద్య పరంగా – కేవలం భౌతిక సంతానం మాత్రమే కాదు. సాధకునిలో
పుట్టే జ్ఞానం, భక్తి, వైరాగ్యం,
మంత్ర సిద్ధి వంటి దైవసంపదలను రక్షించు. అంతేకాదు. గురుపరంపరను రక్షించమని
కూడా అర్ధము. తనయ అంటే శిష్యులు, ఆ తరువాతి తరం సాధకులు ఇలా అని
అర్ధము. ఇక్కడ శంయోః అంటే శివశక్తి సామరస్యంగా కూడా భావించాలి.
ఈ మంత్రం
యొక్క సంపూర్ణ భావము
వైదికంగా ఇది రక్షణ, క్షేమం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థన.
ఈ మంత్రంలో భక్తుడు అగ్నిని ప్రార్థిస్తూ భౌతిక, ఆధ్యాత్మిక,
దైవిక మూడు రకాల కష్టాల నుండి తమను, తమ సంతానాన్ని,
తమ రాజ్యాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాడు. శ్రీవిద్య పరంగా ఇది చిదగ్ని ద్వారా అవిద్యను దాటి
పరాశక్తి సాక్షాత్కారానికి నడిపించే అంతర్ముఖ సాధనకు సంబంధించి అ ప్రార్థన.
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి