సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, ఆగస్టు 2021, గురువారం

వనదుర్గా మంత్ర సాధన

వనదుర్గా మంత్ర సాధన

ఆచార్య ఆదిశంకరుల వారు ప్రతిపాదించిన మంత్రము ఇది. ఎవరైనా వ్యకికి ఏదైనా సంకట పరిస్థితి ఎదురైన్నప్పుడు ఈ మంత్ర స్మరణ మాత్రము చేత అతడు రక్షింపబడతాడు. మంత్ర స్వరూపము ఈ క్రింది విధంగా ఉంటుంది.

“ఉత్తిష్ఠ పురుషి కిం స్వపిషి భంయం మే సముపస్థితమ్|

యది శక్యమశక్యంవా తన్మే భగవతి శమయ స్వాహా”||

ఇది 37 అక్షరముల మంత్రము.

ఋష్యాది న్యాసములు:

ఆరణ్యాకాయ ఋషయే నమః – శిరసి| అనుష్టుప్ ఛందసే నమః – ముఖే| వనదుర్గాదేవతాయై నమః – హృదయే| దుం బీజాయ నమః – గుహ్యే| స్వాహా శక్తయే నమః – పాదయోః| (కీలకం చెప్పబడలేదు)

షడంగన్యాసం:

ఉత్తిష్ఠ పురుషి – హృదయాయ నమః| కిం స్వపిషి – శిరసే స్వాహా| భంయం మే సముపస్థితమ్ – శిఖాయై వషట్| యది శక్యమశక్యంవా – కవచాయ హుం | తన్మే భగవతి – నేత్రత్రయాయ వౌషట్ | శమయ స్వాహా – అస్త్రాయ ఫట్|

మంత్రవర్ణ న్యాసం

ఉం నమః – దక్షపాదమూలే| త్తిం నమః – దక్షపాద జానుని| ష్ఠం నమః – దక్షపాదగుల్ఫే| పుం నమః – దక్షపాదాంగుళిమూలే| రుం నమః – వామపాదమూలే| షిం నమః – వామపాదజానుని| కిం నమః – వామపాదగుల్ఫే| స్వం నమః – వామపాదాంగుళిమూలే| పిం నమః – పాయౌ| షిం నమః – గుహ్యే| భం నమః – మూలాధారే| యం నమః – ఉదరే| మేం నమః – దక్షపార్శ్వే| సం నమః – వామపార్శ్వే| ముం నమః – హృదయే| పం నమః – దక్షస్తనే| స్థిం నమః – వామస్తనే| తం నమః – గళే| యం నమః – దక్షబాహుమూలే| దిం నమః – దక్షబాహుకూర్పరే| శం నమః – దక్షబాహుమణిబంధే| క్యం నమః – దక్షబాహ్వంగుళిమూలే| మం నమః – వామబాహుమూలే| శం నమః – వామబాహుకూర్పరే| క్యం నమః – వామబాహుమణిబంధే| వాం నమః – వామబాహ్వంగుళిమూలే| తం నమః – ముఖే| న్మేం నమః – దక్షనాసికాయాం| భం నమః – వామనాసికాయాం| గం నమః – దక్షకపోలే| వం నమః – వామకపోలే| తిం నమః – దక్షనేత్రే| శం నమః – వామనేత్రే| మం నమః – దక్షకర్ణే| యం నమః – వామకర్ణే| స్వాం నమః – దక్షభృవి| హాం నమః – వామభృవి|

ధ్యానం:

హేమప్రఖ్యామిందుఖండాంతమౌళిం శంఖారీష్టాభీతిహస్తాం త్రినేత్రాం|

హేమాబ్జస్థామ్ పీతవస్త్రామ్ ప్రసన్నాం దేవీం దుర్గాం దివ్యరూపాం నమామి||

అరిషఙ్ఖకృపాణఖేటబాణాన్ సధనుఃశూలకతర్జనీర్దధానా|

భవతాం మహిషోత్తమాంగసంస్థా నవదూర్వాసదృశీ  శ్రీయేస్తు దుర్గా||

చక్రధరఖడ్గఖేటకశరకార్ముకశూలసంజ్ఞకకపాలైః|

ఋష్టిముసలకుంతకనందకవలయగదాభిందిపాలశక్త్యాఖ్యైః||

ఉద్యద్వివకృతిభుజాఢ్యా మాహిషకే సజలజలదసంకాశా|

సింహస్థా వాగ్నినిభా పద్మస్థా వాథ మరకతశ్యామా||

వ్యాఘ్రత్వక్పరిధానా సర్వాభరణాన్వితా త్రినేత్రాచ|

అహికలితనీలకుంచితకుంతలవిలసత్కిరీటశశికళా||

సర్పమయవలయనూపురకాంచీకేయూరహారసంభిన్నా|

సురదితిజాభయభయదా ధ్యేయా కాత్యాయినీ ప్రయోగవిధౌ||

జపవిధి

సాధకుడు తన చిత్తమును చక్కగా నియంత్రించుకుంటూ ప్రజ్వరిల్లిన అగ్నిశిఖలతో సుశోభితమవుచున్న భగవతి వనదుర్గను భావిస్తూ వనదుర్గా మంత్రమును నాలుగు లక్షలు జపించాలి. ధాన్యము – తిలలు – నెయ్యిలతో చేసిన హవిస్సుతో నలభైవేలు హోమము చెయ్యాలి.

యంత్రోద్దారము

బిందువు, రెండు వృత్తములు, వానిపైన అష్టాదళపద్మము, దానిపైన త్రివలయములు. బిందువులో “దుం” లిఖించాలి.

ఆవరణపూజ

న్యాసము, జపము, హోమాది కార్యక్రమములు అయిన తర్వాత ఆవరణపూజ చెయ్యాలి.

అంగమంత్రములు: బిందువు చుట్టూ హ్రాం హృదయాయ నమః| హ్రీం శిరసే స్వాహా| హ్రూం శిఖాయై వషట్| హ్రైం కవచాయ హుం | హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ | హ్రః అస్త్రాయ ఫట్| అని లిఖించాలి.

పై అంగమంత్రములకు మీద వాటి చుట్టూ “ఓం హ్రీం దుం దుర్గాయై” (మొత్తం ఆరుసార్లు) లిఖించాలి.

రెండు వలయములకు మధ్యన మంత్రమును తూర్పు దిక్కునుండి మొదలు పెట్టి లిఖించాలి.

ఉత్తిష్ఠ పురుషి | కిం స్వపిషి | భంయం మే సముపస్థితమ్ | యది శక్యమశక్యంవా | తన్మే భగవతి | శమయ స్వాహా |

అష్టదళములలో తూర్పు దళమునుండి మొదలుపెట్టి ఈ క్రింది అష్టశక్తులను లిఖించాలి.

అష్టశక్తులు: ఆర్యా, దుర్గా, భద్రా, భద్రకాళీ, అంబికా, క్షేమా, వేదగర్భా, క్షేమంకరి

అష్టదళములలో తూర్పు దళమునుండి మొదలుపెట్టి ఈ క్రింది అష్టశక్తులకు మీద వారి ఆయుధములను లిఖించాలి.

అష్టశక్తుల ఆయుధములు: చక్ర, శంఖ, కృపాణ, ఖేటక, బాణ, ధనస్సు, శూల, కపాల

మూడు, నాలుగు వలయముల మధ్యలో తూర్పు దిక్కునుండి మొదలుపెట్టి ఈ క్రింది అష్టమాతృకలను లిఖించాలి.

అష్టమాతృకలు: బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, చండిక

నాలుగు, అయిదు వలయముల మధ్యలో తూర్పు దిక్కునుండి మొదలుపెట్టి ఈ క్రింది దశదిక్పాలకులను లిఖించాలి. బ్రహ్మను ఇంద్రపైన, అనంతను వారుణ కింద లిఖించాలి.

దశదిక్పాలకులు: ఇంద్ర, అగ్ని, యమ, నైఋతి, వారుణి, అనిల, కుబేర, శివ, బ్రహ్మ, అనంత.

నాలుగు, అయిదు వలయముల మధ్యలో తూర్పు దిక్కునుండి మొదలుపెట్టి దశదిక్పాలకులకు మీద ఈ క్రింది ఆయుధములను లిఖించాలి. పద్మమును వజ్రపైన, చక్రమును పాశ కింద లిఖించాలి.

దశదిక్పాలకుల ఆయుధములు: వజ్ర, శక్తి, దండ, ఖడ్గ, పాశ, అంకుశ, గద, త్రిశూల, పద్మ, చక్ర

అయిదవ వలయము బాహ్యమున అం నుండి క్షం వరకు మాతృకలను తూర్పు దిక్కునుండి మొదలు పెట్టి లిఖించాలి.

మంత్ర ప్రయోగము

1.          సామాన్యంగా తమ రక్ష కొరకు ఈ మంత్రమును వెయ్యిసార్లు లేదా నూరుసార్లు జపించాలి.

2.          శంకరాచార్యులవారి అనుసారము, ఏ ఉద్దేశముతో ఈ మంత్రమును వెయ్యిసార్లు లేదా పదివేలసార్లు జపిస్తామో ఆ ఉద్దేశము ఎంత అసాధ్య కార్యమైన అమ్మవారి కృప వలన అతి శీఘ్రంగా ఫలిస్తుంది.

3.          సామాన్యంగా ప్రాతఃకాలంలో స్నానం చేసి సూర్యునికి అభిముఖంగా నడుములోతు నీళ్ళల్లో ఉండి ప్రతిరోజూ 108సార్లు జపము చేస్తే సాధకుని మనోరథము ఫలించి లక్ష్మి ప్రాప్తిస్తుంది.

4.          దేవిని ధ్యానించి జ్వరము, సర్పము, గ్రహాదులతో పీడింపబడుచున్న వ్యక్తిని స్పర్శిస్తూ మంత్ర జపము చేసినచో ఆయా ఉపద్రవములు శాంతించును.

5.          అపామార్గ సమిధలతో ప్రజ్వరిల్లిన అగ్నిలో వనతిలలు లేదా ఆవాలతో 10వేల హోమము చేస్తే అపస్మారాది రోగములు వెంటనే నశించును.

ఈ విధంగా గ్రహాపీడ, కామ్యకర్మలు, శత్రువు మీద విజయము, లోక తిరస్కారము, ఉచ్చాటన, శత్రు సేనల స్తంబనము, మారణప్రయోగము, ఉన్మాద ముక్తి, రాష్ట్రాది రక్ష, వశీకరణము మొదలగు ప్రయోగములు చెయ్యవచ్చును.

కామెంట్‌లు లేవు: