యాభైవ భాగము
విజయానిత్యావిధివివరణం
మంత్ర స్వరూపము: హ్స్ఖ్ఫ్రేం విజయాయై నమః
ఋషి – ఈశ్వర| ఛందస్సు – గాయత్రి| దేవత – విజయా| హ్రీం – బీజం| నమః – శక్తిః| క్లీం – కీలకం| హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః – షడంగన్యాసం|
యాభైవ భాగము
విజయానిత్యావిధివివరణం
మంత్ర స్వరూపము: హ్స్ఖ్ఫ్రేం విజయాయై నమః
ఋషి – ఈశ్వర| ఛందస్సు – గాయత్రి| దేవత – విజయా| హ్రీం – బీజం| నమః – శక్తిః| క్లీం – కీలకం| హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః – షడంగన్యాసం|
నలభైఎనిమిదవ భాగము
నిత్యాద్వయవిధివివరణం
ఈమెనే శ్రీకులసుందరీ అని కూడా అంటారు. బాలా అను పేరు గల ఈ త్రిపురేశ్వరీ పూర్వ సింహాసనమున ఉండును. శ్రీకులసుందరి బ్రహ్మ, విష్ణు, మహేశాదులతో పూజింపబడుచుండును. ఈమె పురుషార్థప్రదాయిని.
శ్రీవనదుర్గా పంచశతి అనుష్ఠాన క్రమం
గురువుగారి ఆశీస్సులు మరియు అనుమతితో శ్రీవనదుర్గా మహావిద్యను ముద్రిస్తున్నాను. ఇందులో రెండు ఖండములు కలవు. ఒకటి దిగ్బంధన ఖండము. రెండు పారాయణ ఖండము. మొదటి ఖండము లో 343 మంత్రములు, రెండవ ఖండము లో 157 మంత్రములు కలిపి మొత్తం 500 మంత్రములు. దిగ్బంధనముల ప్రయోజనము, నాకు లభ్యమైనంత వరకు తెలిసినంత వరకు చాలా మంత్రముల పేరు, వాటి ప్రయోజనం ఇవ్వడం జరిగింది. అంతే కాకుండ మూల మంత్రమునకు సంబంధించిన పూర్వాంగ, ఉత్తరాంగ మంత్రములు వాటి న్యాసములతో కూడా ఈ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. వనదుర్గా సాధకులకు ఈ గ్రంథం కచ్చితంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్ వారి ద్వారా ఈ క్రింది లింకు ద్వారా లభించును.
నలభైఆరవ భాగము
శివదూతీనిత్యావిధివివరణం
మంత్రస్వరూపము:
హ్రీం శివదూత్యై నమః
ఈ విద్య త్రైలోక్యమునకు స్వామిని. ఋషి – రుద్ర| ఛందస్సు – గాయత్రి| దేవతా – శివా| హ్రీం – బీజం| నమః – శక్తిః| శివదూతీ -కీలకం| హ్రీం, శివదూతీ, నమః – రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి.
నలభైనాల్గవ భాగము
వహ్నివాసినీనిత్యావిధివివరణం
మంత్ర
స్వరూపం: హ్రీం వహ్నివాసిన్యై నమః|
ఎనిమిది అక్షరముల ఈ మంత్రము పురుషార్థప్రదాయిని. ఈ మంత్ర ఋషి – వశిష్ఠ| ఛందస్సు – గాయత్రి| దేవత – వహ్నివాసిని| హ్రీం – బీజం| నమః – శక్తిః| వహ్నివాసిని – కీలకం| దేవీ మంత్రముతో షడంగన్యాసం చెయ్యాలి.
శ్రీచక్రనిర్మాణ ప్రకారము
శ్రీచక్రము మూడు ప్రకారములుగా ఉంటుంది. అవి భూప్రస్తారము, మేరుప్రస్తారము, కైలాసప్రస్తారము. మేరు ప్రస్తారము నిత్యాతాదాత్మికము. కైలాసప్రస్తారము మాతృకాత్మకము. భూప్రస్తారము వశిన్యాత్మకము. మేరుప్రస్తారము నందు పూజ సృష్టిక్రమము నందు, కైలాసప్రస్తారము నందు సంహారక్రమములోను, భూప్రస్తారము నందు స్థితిక్రమములో, కైలాసప్రస్తారము నందు అర్ధమేరుక్రమములో పూజ చెయ్యాలి. ప్రత్యేక చక్రము నందు పూజ మూడు భేదములుగా ఉండును. కౌళమతములో సృష్టి మరియు సంహారక్రములలో రెండింటిలోనూ పూజ జరుగుతుంది. సమయమతము నందు సృష్టి మరియు స్థితి క్రమములలో పూజ జరుగుతుంది. శుద్ధ పూజ అతిరహస్యము. మేరు చక్రము నందు సంహారక్రమములో పూజ జరగదు. అందువలన మేరుప్రస్తారములో జాగ్రత్తగా పూజ చెయ్యాలి. కైలాసప్రస్తారమునందు సంహారక్రమములో పూజ చెయ్యాలి. భూప్రస్తారము నందు స్థితిక్రమంలో పూజ ఉత్తమం అవుతుంది. గృహస్థులు స్థితి క్రమములోను, వానప్రస్థులు మరియు యతులు సంహారక్రమంలోను పూజ చెయ్యాలి. బ్రహ్మచారులు సృష్టి క్రమంలో పూజ చెయ్యాలి.